సమాజంలో  రోజురోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మనుషులను చంపడానికి వెనకాడడం లేదు సాటి మనుషులు. సాటి మనిషికి సాయం చేసే మనుషుల కన్నా.. సాటి మనిషి ప్రాణాలను తీసే మనుషులు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతం మనిషి ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది. చిన్న చిన్న గొడవలకి రాక్షసుల మారిపోతున్న మనుషులు ప్రాణాలను సైతం తీస్తున్నారు. అందరు చూస్తుండగానే రోడ్లమీద కత్తులతో నరికి మరి హత్యలు చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది మనుషులు. రోజురోజుకు రాక్షసుల్లా తయారవుతున్న మనుషుల్లో బతకాలంటే భయపడుతున్నారు సాటి  మనుషులు. దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతోంది. హత్యలు జరగకుండా క్రైం రేటు తగ్గించడానికి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఎలాంటి మార్పు మాత్రం కనిపించడం లేదు. 



 హైదరాబాద్ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఎమ్మార్వో ఆఫీస్ లోకి వెళ్లి తాసిల్దార్ పైన పెట్రోల్ పోసి నిప్పంటించి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు  దుండగులు. దీంతో మంటలు అంటుకున్న ఆ తాసిల్దార్ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. తాసిల్దార్ ఆఫీసు లోనే తాసిల్దార్ విజయ రెడ్డి పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సాటి ఉద్యోగులకు కూడా గాయాలు అయ్యాయి . ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత దుండగులు వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి తాసిల్దార్ విజయ రెడ్డి తో మాట్లాడేందుకు ఆఫీస్ లోకి వెళ్ళాడు అరగంటపాటు ఆ వ్యక్తి బయటకు రాలేదు అనంతరం  ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు. ఒంటినిండా మంటలు అంటుకున్న ఆమె అక్కడే సజీవదహనం అయిపోయింది. 



 ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. అందరూ ఉండగానే మధ్యాహ్నం సమయంలో అదీ  ఒక ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతగల తాసిల్దార్ పదవిలో ఉన్న ఒక మహిళ ని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే విజయ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులను కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఘటనపై భగ్గుమంటున్నాయి. ఒక తాసిల్దార్ కార్యాలయం లోనే మహిళా ఉద్యోగులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: