తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టులో తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి దారుణంగా చంపేశారు. దీంతో ఆమె అరిచిన అరుపులు కార్యాలయంలో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాయి. అక్కడ ఉన్న సిబ్బంది తహసీల్దార్ విజయ రెడ్డి ని కాపాడాలని ప్రయత్నించిన క్షణాల్లో ఆమె మృతి చెందింది. అయితే ఈ ఘటన లో పాల్పడిన వ్యక్తి గురించి ఇంకా ఆచూకి రాలేదు. ఇదిలా ఉండగా ఆమె కార్యాలయంలోకి మొదటిగా ఎమ్మార్వో తో మాట్లాడాలి అంటూ బయట ఉన్న సిబ్బందితో దుండగుడు మాట్లాడి కార్యాలయంలోకి వెళ్లి విజయ రెడ్డి ఛాంబర్ లోకి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం జరిగింది అని కార్యాలయంలో ఉన్న కొంతమంది చెబుతున్నారు.


దీంతో అదే సమయంలో మంటలు అంటుకున్న విజయారెడ్డి పరిగెడుతూ బయటకు రాగా మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. తహసీల్దార్ కారిడార్‌ లోకి వచ్చేసరికి పూర్తిగా ఆమె మంటలకు ఆహుతైంది పూర్తిగా  మంటల్లో చిక్కుకుపోయిన విజయారెడ్డి అక్కడికక్కడే కప్పకూలి మృతి చెందినట్టుగా తోటి ఉద్యోగులు చెప్పారు. ఇదే క్రమంలో ఘటనకు పాల్పడిన వ్యక్తి తనకు తాను కూడా సజీవదహనం చేసుకుందామని భావించి చివరాకరికి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.


దీంతో ఈ ఘటన జరగడంతో రెవెన్యూ ఉద్యోగులు ఫుల్లుగా తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ విమర్శలు చేస్తూ ఈ ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్వో లకే భద్రత లేకపోతే సామాన్యులకు ఇంకేం భద్రత ఉంటుందని తెలంగాణలో మొట్టమొదటిసారి ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి ఘటన జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. పాస్ బుక్ వ్యవహారంలో వచ్చిన తేడాలే ఈ ఘటనకు మూలమని అంటున్నారు కొంతమంది ఎమ్మార్వో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు.



మరింత సమాచారం తెలుసుకోండి: