దేశంలో మహిళలకు గట్టి భద్రత కల్పిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వాలు చెబుతున్నా..మరోవైపు దారుణమైన హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా  హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు.  ఈ ఘటనలో మృతురాలు విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు.  మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

అయితే నింధితుడు తనపై కూడా పెట్రోలో పోసుకొని నిప్పంటిచుకున్నట్లు తెలుస్తుంది. కాగా, తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలిస్తున్న కలెక్టర్.  విజయారెడ్డి స్వగ్రామం నకిరేకల్ మండలం తోటపల్లి గ్రామం. అయితే ఇంత దారుణానికి పాల్పపడిన వ్యక్తికి కఠినంగా శిక్షపడే ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని కదలించం అంటున్న రెవెన్యూ సిబ్బంది.

తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక మహిళా ఉద్యోగిని అమానవికంగా, క్రూరంగా హత్యచేయడం దారుణం అని రెవెన్యూ సంఘం తీవ్రంగా ఖండించింది.  ఈ నేపథ్యంలో తమకు విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపాలని భావిస్తున్నారు.  ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

గతంలో కూడా కొంత మంది పైస్థాయి అధికారులను తీవ్రంగా బెదిరించి భయాందోళనకు గురి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని డీజీపి, హోంమంత్రిని కలవనున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు. ఇదిలా ఉంటే విజయారెడ్డిన కాపాడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పట్టపగలే తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఉద్యోగిణులు ఒక్కసారే ఉలిక్క పడ్డారు.  తమకు రక్షణ కల్పించాలని  డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: