తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో గా  ప్రారంభమైన షో బిగ్ బాస్  తెలుగు సీజన్ 3. కొద్ది రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో నిన్నటితో ముగిసిపోయింది. కాగా నిన్న జరిగిన ఫైనల్ విన్నర్ ఎపిసోడ్ సందడి సందడిగా జరిగింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సైతం బిగ్ బాస్  స్టేజి మీద మత్తెక్కించే డాన్సులతో  అదరగొట్టారు. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ షో నుంచిటాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉంటే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో  సెలబ్రిటీ వచ్చి హౌస్ నుండి  ఒక్కో కంటెస్టెంట్ నీ  ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇక చివరగా బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ శ్రీముఖి మిగిలారు. దీంతో వీరిద్దరి లో బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ కి టైటిల్ ప్రెసెంట్  చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇక గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అక్కడే ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో తెగ సందడి చేశారు. 



 అయితే తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన బిగ్ బాస్  ఎపిసోడ్ లో చివరికి టైటిల్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. బిగ్ బాస్ టైటిల్ గెలవటం తో  రాహుల్ సిప్లిగంజ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. అయితే రన్నరప్ గా  శ్రీముఖి నిలిచింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కా రాహుల్ నిలవడంతో చాలామంది షాక్ కి గురయ్యారు. బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి టైటిల్ విన్నర్ గా శ్రీముఖి అవుతుందని అందరూ భావించారు. సోషల్ మీడియాలో ఇటు బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా శ్రీముఖి విజయం సాధించడం ఖాయమని భావనలో ఉన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాహుల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే నటి గాయత్రి గుప్తా కూడా టైటిల్ శ్రీముఖి కి మాత్రమే ఫిక్స్ అయింది అంటూ కామెంట్లు కూడా చేసింది. కానీ చివరికి శ్రీముఖి మాత్రం రన్నరప్ గానే  సరిపెట్టుకుంది. 
 అయితే బిగ్ బాస్ విన్నర్ గా అదరు శ్రీముఖి అవుతుంది అనుకున్న తరుణంలో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది . ఈ నేపథ్యంలో శ్రీముఖి విన్నర్ గా కాకుండా రన్నర్ గా మారడానికి  కూడా కారణాలు చాలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.





శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అప్పట్నుంచి తన మార్కును ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నప్పటికీ... అక్కడక్కడ చిన్న చిన్న గొడవలతో శ్రీముఖి నెగిటివిటీ కూడా ఏర్పడింది. అంతేకాకుండా రాహుల్ సిప్లిగంజ్ పై  ఎప్పుడు శ్రీముఖి అనవసరంగా  నోరు పారేసుకోవడం తో ప్రేక్షకుల్లో ఆ నెగిటివిటీ ఇంకాస్త ఎక్కువైనట్లుంది. అంతేకాకుండా ఇంకొంతమంది టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి వెళ్ళినప్పటి నుంచి ఓవరాక్షన్ ఎక్కువ చేసిందని అందువల్లే ప్రేక్షకులు అది జీర్ణించుకోలేకపోయారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా  బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కూడా హౌస్ లో శ్రీముఖి కి బిగ్ బాస్ హెల్ప్ చేస్తున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అదికాస్తా శ్రీముఖి పై ప్రేక్షకుల్లో నెగటివ్ ఇంప్రెషన్  వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంలో బిగ్ బాస్  కూడా శ్రీముఖి విషయంలో  మరోసారి ఆలోచించినట్టు  సమాచారం... బయటకి వెళ్లిన  కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ శ్రీముఖికి  హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పడంతో ప్రేక్షకుల్లో నిజంగానే బిగ్ బాస్  శ్రీముఖికి  హెల్ప్ చేస్తున్నాడా  అనే ఆలోచన కలిగింది... ఈ నేపథ్యంలో శ్రీముఖి గెలిస్తే అది నిజం కావటం  ఖాయం. అందువల్లే బిగ్ బాస్ రాహుల్ వైపు మొగ్గు చూపినట్లు  వార్తలు కూడా వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: