తహశీల్ధార్ విజయా రెడ్డి సజీవ దహన ఘటన లో  సమాధానం లేని ఎన్నో  ప్రశ్నలు తలెత్తుతున్నాయి . విజయా రెడ్డి ని మండల పరిధిలోని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే ఆగంతకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లుగా తెలుస్తోంది . అయితే సురేష్ , తహశీల్ధార్ ఛాంబర్ లోకి పెట్రోల్ డబ్బాను ఎలా తీసుకు వెళ్ళారన్నది ప్రశ్నార్ధకంగా మారింది . పెట్రోల్ డబ్బా తో ఆగంతకుడు , తహశీల్ధార్ ఛాంబర్ లోకి వెళ్తుంటే సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్న తలెత్తుతుండగా  , ఒకవేళ నిజంగానే పెట్రోల్ డబ్బా తో ఆగంతకుడు తహసీల్దార్ ఛాంబర్ లోకి వెళితే అరగంట సేపు , విజయారెడ్డి అతనితో ఎలా ముచ్చటించిందన్నది ప్రశ్నార్ధకంగా మారింది .

దానికి తోడు తహసీల్దార్ ఛాంబర్ లో పెట్రోల్ డబ్బాలాంటిది ఏది లభించకపోవడం , తహశీల్ధార్ ఛాంబర్ వెనుక వైపు ఉన్న కిటికీ అద్దం ధ్వంసమై ఉండడం పరిశీలిస్తే , ఈ ఘటన లో ఒక్కడే కాకుండా ఇద్దరు  పాల్గొని ఉండి, ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఒకరు తహశీల్ధార్ తో మాట్లాడేందుకు ఛాంబర్ లోనికి వెళ్లగా , అదను చూసుకుని మరొక వ్యక్తి అతనికి పెట్రోల్ డబ్బా అందించి ఉండడవచ్చునన్న కోణం లో పోలీసులు దర్యాఫు చేస్తున్నారు . ఇక తహశీల్ధార్ సజీవ దహన ఘటనను రెవిన్యూ అధికారుల సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు .

భద్రతా లేకుండా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . విజయారెడ్డి సజీవ దహన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు . అధికారులు కూడా ప్రజల కోసమే పని చేస్తున్నారని , ఈ తరహా ఘటనలు క్షమించరాని నేరమని రాష్ట్ర విద్య శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: