తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రేపటి తో నెల రోజులు అవుతుంది. సమ్మె పై ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. తాజా గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగంలో చేరడానికి మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 5 లోపు కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరవచ్చు అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోకపోతే ఆర్టీసీ లో ప్రైవేట్ ఆపరేటర్లని 100% అనుమతిస్తామని అల్టిమేటం విధించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసి లో ప్రైవేట్ బస్సులను 50% అనుమతించిన విషయం తెలిసిందే.


మరో వైపు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తమ ఆందోళన ను ఇంకా ఉదృతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఆర్టీసీ కార్మికులకు అందలేదు. అక్టోబర్ నెల లో సమ్మె లో వున్న కారణం గా ఈ నెల కూడా కార్మికులకు జీతాలు అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు ఆందోళన చెంది ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటం లోపు డిపోలలో రిపోర్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్స్ కార్మికులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్తున్నారు.


ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో లో డ్రైవర్ గా పని చేస్తున్న  మొబిన్ తన విధులకు హాజరయ్యాడు ఈ మేరకు తాను ఉద్యోగం లో చేరుతున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర బాబు కు రిపోర్ట్ చేసారు అలాగే భద్రాచలం డిపో కు చెందిన శేషాద్రి అనే డ్రైవర్ కూడా విధులకు హాజరు అయ్యాడు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రేపటి తో ప్రభుత్వం విధించిన గడువు ముగుస్తుడడంతో ఎంత మంది ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరతారు అనేది ఆసక్తికరంగా మారింది.


వీలీనమే ప్రధాన డిమాండ్ గా సమ్మె కి దిగిన ఆర్టీసి కార్మికులు తమ డిమాండ్ నెరవేరేవరకు సమ్మె చేస్తారా లేదంటే ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరుతారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: