సమాజంలో రోజురోజుకీ మహిళలకు రక్షణ కరువవుతోంది. ఓవైపు లైంగిక వేధింపులు జరుగుతుంటే మరోవైపు మహిళలపై హత్యలు   జరుగుతున్నాయి . మహిళలు అడుగు బయట పెడితే చాలు అడుగడుగునా అపాయమె  ఏర్పడుతుందని. ఇప్పటికే మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... అవన్నీ రాక్షసుల్లా మారుతున్న  మనుషుల ముందు నిలబడలేక పోతున్నాయి . ఇప్పటికే మహిళలపై ఎన్నో ఘోరాలు జరగ్గా...  మరోసారి హైదరాబాద్ శివారులోనే  దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఏకంగా తాసిల్దార్ కార్యాలయంలో ని అందరూ ఉండగానే ఓ మహిళా తహిసీల్దార్ పై  పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు దుండగులు. ఘటన తో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే మంటలతో తాసిల్దార్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తాసిల్దార్ ను కాపాడేందుకు ప్రయత్నించిన సాటి ఉద్యోగులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ మహిళా తహసిల్దార్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలైనా మిగతా సిబ్బందిని  ఆస్పత్రికి తరలించారు. 



 మధ్యాహ్న సమయంలో సురేష్ అనే వ్యక్తి  తహసిల్దార్ విజయా రెడ్డి తో మాట్లాడాలంటూ ఆఫీస్ లోకి వెళ్ళాడు. అరగంట పాటు చర్చించారు... ఇంతలో ఒంటిపై మంటలతో  విజయారెడ్డి బయటకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేయగా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.ఇక  విజయారెడ్డి అందరిముందే మంటల్లో అల్లాడుతూ సజీవదహనం అయిపోయింది. తాసిల్దార్ విజయ రెడ్డి కి మంటలు  అంటించిన వ్యక్తి రైతు గా గుర్తించారు పోలీసులు. హత్య చేసిన వ్యక్తి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఒక ఎమ్మార్వో కార్యాలయం లోనే తాసిల్దార్ విజయారెడ్డి ని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం తెలంగాణలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. 



 దీనిపై ఉద్యోగ సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి. రోజు రోజుకి మహిళలపై దాడులు హత్యలు హత్యచారాలు ఎక్కువవుతున్న తరుణంలో... ఒక ప్రభుత్వ కార్యాలయంలో అది అందరూ చూస్తుండగానే ఒక బాధ్యతగల పదవిలో కొనసాగుతున్న ఒక మహిళా తహసిల్దార్ విజయారెడ్డిని హత్య చేయడం చూస్తుంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రవేట్ కంపెనీలలో పని  చేయడానికి రక్షణ కరువైన మహిళలకు ... ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా భద్రత లేదనీ  ఉద్యోగాలు చేయడం కష్టమే అంటున్నారు మహిళా ఉద్యోగులు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి . ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ మహిళలకు రక్షణ దొరుకుతుంది అని  ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: