సమాజంలో మనుషులకు రోజురోజుకు భద్రత కరువవుతుందని మనం వింటూనే ఉన్నాం. అది తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో నిజమే అనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ దాడి మరెంతమంది  ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడానికి ప్రేరణగా మారుతుందో తెలియదు. మనుషులు ఇంతగా కౄరంగా మారి సాటి మనిషి ప్రాణాలను జాలి, దయ లేకుండా తీసేయడం నిజంగా వికృతమైన చర్య. ప్రేమిస్తే పిల్లలను కాని వారిని ప్రేమించిన వారిని గాని నడి రోడ్డుపై చంపడం అనే సంసృతి మొన్నటి వరకు నడిచింది.


ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పనులు చేయడం ఆలస్యమైతే కక్షకట్టి ఇలా విధినిర్వహణలో ఉండగానే చంపడం అనేది సమాజం సిగ్గుతో తలవంచుకునే విషయంగా భావించవచ్చూ. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం తహశీల్దార్ విజయారెడ్డిపై దాడి తాలూకూ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. మీకు మీకు ఏమైన సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలే తప్ప.. దాడులు చేయడం సరికాదని స్పష్టంచేసింది ఘటనపై విచారణకు కమిటీ కమిటీ వేస్తున్నట్టు పేర్కొన్నది.


నిందితుడిపై ఘటన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అంతే కాకుండా నిందుతుడు ఎవరైన అతనికి తగిన విధంగా శిక్ష అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా పేర్కొంది.  ఇకపోతే నిందుతుడు హత్య చేయడానికంటే ముందుగా  విజయారెడ్డిపై  చేయికూడా చేసుకున్నారని తెలుస్తోంది. అతను దాడి చేయడంతో విజయారెడ్డి ఆరిచారని.. అరుపులను డ్రైవర్ విన్నారని పోలీసులు చెప్తున్నారు.


ఇక పథకం ప్రకారమే అతను విజయారెడ్డి చాంబర్లోకి వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ సంఘటనతో ఉద్యోగుల్లో తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్న్నట్లు పేర్కొంటున్నారు. ఇకపోతే మరోవైపు విజయారెడ్డిన హతమార్చిన నిందితుడికి తీవ్రగాయాలవగా.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అతను తహశీల్దార్ కార్యాలయం నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: