మహిళలకు రక్షణ రోజు రోజుకు కరువవుతుందని మహిళా తహసీల్దార్ విజయారెడ్డి హత్య తెలియచేస్తుంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడిని రైతు సురేష్ గా పోలీసులు గుర్తించారు. తహశీల్దార్ కు నిప్పు పెట్టిన సమయంలో సురేష్ కు కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే చొక్కా విప్పేసిన సురేష్.. తలుపులు తీసిన బయటికి పరుగులు తీశాడు.


ఈ ఘటనలో నిందితుడు సురేష్ కూడా తీవ్రంగా గాయపడగా అలాగే నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇక పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి వేధిస్తున్నారని అందుకే తాను హత్య చేశానని విచారణలో సురేష్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఇకపోతే నిందితుడు పూర్తి పేరు కుర్రా సురేష్ అని..ఇతను  గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు అని, సురేష్ కి సంబంధించిన 7 ఎకరాల భూమి వివాదంలో ఉండగా, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై తహశీల్దార్ ను హత్య చేశాడా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉందన్నారు.


సురేష్ పై హత్యా నేరం ఫైల్ చేస్తున్నామని, ఉరిశిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెప్పారు. ఇక నిందుతుడు సురేష్ మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో తహసీల్దార్ ఆఫీస్ లోకి వచ్చి మేడం తో మాట్లాడాలని చాంబర్ లోనికి వెళ్లాడు. లోపల ఇద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలి నుంచి కేకలు వినిపించాయి. ఏమైందని సిబ్బంది లోనికి చూస్తుండగానే అప్పటికే  విజయ మంటల్లో తగలబడిపోతూ  అరుచుకుంటూ బయటకు వచ్చారు.


ఇద్దరు సిబ్బంది ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలు కావడంతో విజయ స్పాట్ లోనే చనిపోగా. ఆమెని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడగా. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: