ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీఅధ్యక్షుడుకేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయున పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. చాల రోజుల తరువాత సోషల్ మీడియాలో మళ్లీ దర్శనమిచ్చారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

అందులో ముందుగా తాను రెగ్యులర్‌గా షోలో కనిపించడం లేదని క్షమాపణలు కోరిన పాల్.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు త్వరలో లేఖ రాయబోతున్నా అంటూ వివరించాడు. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే ఏడుగురు దేశాధినేతలను కలిశానని వెల్లడించారు. అందుకే తాను పలు కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు.


ఇక ఈ వీడియోకు వర్మ దండాలు ఉన్న ఎమోజీలని పెట్టగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ పాల్ చాలానే చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన వ్యాఖ్యలు నిజాలే అయినప్పటికీ.. కాలక్రమేణా కామెడీగా అయిపోయాయి. ఇదిలా ఉంటే వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లులో చిత్రంలో కేఏ పాల్ పాత్రను కూడా పెట్టారు. అంతేకాదు అందులో కేఏ పాల్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు.. ఓ పాటను కూడా విడుదల చేశాడు.

నా టార్గెడ్ మోడీ అంటూ.. తన ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలోని అందరూ ప్రధానులు అటెండ్ అవుతారని.. పాకిస్థాన్ యుద్దాన్ని తాను ఆపానని.. ఇలా పాటలో కేఏ పాల్ కొన్ని వ్యాఖ్యలి జోడిస్తూ.. చాలా సెటైరికల్‌గా రూపొందించారు. వీటికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన హడావిడినంతా ఈ సినిమాలో చూపించబోతున్నారు వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: