నిన్న విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై నేడు అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, అలానే పలు ఇతర ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలించడం, మరియు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల ఆవేదనకు ఎంతో చలించిపోయి నిన్నటి లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ఇక ఈ మార్చ్ ను ఎంతో మంచి సక్సెస్ చేసిన ప్రజలందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు పవన్. తనకు వైసిపి నాయకులపై ప్రత్యేకంగా వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వ నియంతృత్వ విధానాల మీద మాత్రమే వ్యతిరేకత ఉందని అన్నారు. 

ఇక తను కోరిన వెంటనే మద్దతుగా వచ్చిన వామపక్షాలు మరియు టిడిపి నేతలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి నాయకులు పలు విధాలుగా మార్చ్ ను ఆపాలని ప్రయత్నించారని, అయినప్పటికీ అది కుదరలేదని అన్నారు. సీఎం హోదాలో ఉన్న జగన్ గారు ముందుగా ప్రజల కనీస సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని మాట్లాడిన పవన్, వైసిపి నేత అంబటిపై కొంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసారు. ఆఖరికి అంబటి గారు కూడా మాపై కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమి చెప్పగలం అంటూ వ్యాఖ్యానించారు పవన్. తాను ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధమని, ఇక రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలపై తమ పార్టీ మరింత దృష్టిప పెట్టి, ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై ఫోకస్ చేస్తుందని ఆయన తెలిపారు. 

ఇక విశాఖలోని స్థానికి నేతలు కూడా ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తమ వారికి మాత్రమే పనులు కట్టబెట్టడం దారుణమని పవన్ అన్నారు. అయితే ప్రభుత్వం పై పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు సుముఖత వ్యక్తం చేస్తుంటే, పవన్ కు పూర్తిగా రాజకీయం తెలియదంటూ ఆయన పై విముఖత వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: