హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి పై దాడి ఘటన జ‌రిగింది. నేరుగా తహ‌సీల్దార్ ఆఫీస్‌కి వెళ్ళి నేరుగా విజ‌యారెడ్డి గ‌దిలోకి వెళ్ళి త‌లుపు వేసి నిప్పు అంటించాడు. ఆమె అరుపులు కేక‌ల‌తో ఘోర ప్ర‌మాదానికి గుర‌యింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన నిందితుడు ఆమెను త‌గ‌ల‌బెట్టే ప‌నిలో న‌రేష్ త‌న‌కు తాను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు జ‌రిగింది. ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 


తనను లంచం అడిగినందుకే విజయారెడ్డిని సజీవ దహనం చేసినట్టు నిందితుడు, రైతు సురేష్ పోలీసులకు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు నిందితుడిని మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే చనిపోయిన విజయారెడ్డి... తనకు ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే ఊహించారనే విషయం ఆమె బంధువుల మాటలను బట్టి అర్థమవుతోంది. విజయారెడ్డి హత్యపై స్పందించిన ఆమె మేనమామ వెంకట్ రెడ్డి... కొద్దిరోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో సెక్యూరిటీ కోసం ఫిర్యాదు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.


గతేడాది విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకుందని విజయారెడ్డి మేనమామ వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మూడేళ్ల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయారెడ్డి పని చేస్తున్నారని... ఏ విషయంలో అయినా ఆమె ముక్కుసూటిగా వ్యవహరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయారెడ్డి ఇద్దరు సంతానం. పాపకు పదేళ్లు, బాబుకు ఐదేళ్లు. మొదట ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసిన విజయారెడ్డి... ఆ తరువాత గ్రూప్ 2లో ఉత్తర్ణీత సాధించారు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్ నగర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అనూహ్యంగా బిత్త‌ర‌పోయిన విజ‌యారెడ్డి అరుపుల‌కు కొంద‌రు కాపాడ‌డానికి వెళ్ళ‌గా వారికి కూడా కొంత‌మందికి నిప్పుఅంటుకుంది. సురేష్ ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. ఈ దాడికి ఉద్యోగాలు చాలా మంది నివ్వెర‌పోతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగికి కూడా క‌నీస ర‌క్ష‌ణ లేదా అనే నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: