రాష్ట్రంలో ఇసుక ల‌భ్య‌త లేదంటూ.. ప్ర‌తిప‌క్షాలు గొంతు చించుకుంటున్నాయి. వాస్త‌వానికి ఇప్పుడు వ‌ర్షాకాలం ముగిసినా.. అల్ప‌పీడ‌న ద్రోణి, వాయుగుండాల కార‌ణంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా న‌దులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో ఇసుక తీయ‌డం అనేది చాలా క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌గా మారింది. క్షేత్ర‌స్థాయిలో ఈ విష‌యం తెలిసి కూడా ప‌లు రాజ‌కీయ పార్టీలు మాత్రం ప్ర‌భుత్వంపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. దీనిని అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఛీకొడుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నాయి.


అయితే, వాస్త‌వంలోకి వెళ్తే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాష్ట్రంలో ఇసుక ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. కార్మికులకు ఇబ్బంది ఉన్నా.. సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం త‌మ ఇళ్ల‌ను వాయిదా వేసుకు న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ఇత‌ర ముడి స‌రుకుల ల‌భ్య‌త లేనందున ఇళ్ల‌ను వాయిదా వేసుకున్నారు. ఈ క్ర‌మంలో కార్మికుల‌కు ప్ర‌త్యామ్నాయ ఉపాధిని చూపించ‌గ‌లిగితే.. ఇసుక స‌మ‌స్య పెద్ద‌గా ఉత్ప‌న్న‌మ య్యే ప‌రిస్థితి లేదు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ ప‌క్షాలు క్షేత్ర‌స్తాయి ప‌రిస్థితి తెలిసినా.. కావాల‌నే రాళ్లు రువ్వుతున్నారు.


అయితే, ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అమ‌లు చేసిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో లబ్ధి పొందిన 75 శాతం మంది ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఏ మాత్ర‌మూ ప‌ట్టించుకోవ‌డం లేదు. సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను క‌నులార చూశార‌ని, కాబ‌ట్టి ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌జ‌ల‌ను, కార్మికుల‌ను ఇబ్బంది పెట్టే చ‌ర్య‌లు తీసుకోర‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భావిస్తున్నారు.


కేవ‌లం టీడీపీ, జ‌న‌సేన వంటి ప్ర‌జ‌ల‌తో ఛీకొట్టించుకున్న పార్టీ చేసే ర‌గ‌డ‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోరాద‌ని కూడా ప్ర‌జ‌లు తీర్మానించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ అయినా, బాబు అయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయ‌డం కంటే జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. సో.. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త‌ను ఈ రాజ‌కీయ ప‌క్షాలు మ‌రో మార్గం ఏదైనా ఎంచుకుంటే బెట‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: