ఏపీలో ఇసుక కొరత సమస్యపై, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులపై కమలదళం గళమెత్తింది. ఇసుక కొరత కృత్రిమంగా సృష్టించి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడింది. నిర్మాణ కార్మికులకు నెలకు 10 వేలు వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 


భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి బీజేపీ బీజేపీ ఇసుక సత్యాగ్రహం పేరుతో బెజవాడ ధర్నా చౌక్ లో కార్యక్రమం నిర్వహించింది. ఇందులోఆ పార్టీ అ్రగ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, దగ్గుబాటి పురంధరేశ్వరి,  కామినేని శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు, మాణిక్యాల రావు పాల్గొన్నారు.


రాష్ట్రంలొ అసమర్థ పాలన నడుస్తోందని బీజేపీ ఎపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించాడు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లబొల్లి మాటలతో ప్రజలను నమ్మించారన్నారు. గతంలో చంద్రబాబు అనుభవమంతా దోచుకోవడానికే ఉపయోగపడింది తప్ప ఒక్క పేదవాడికి కూడా మంచి జరగలేదన్నారు. చంద్రబాబు చూపించిన తోవలో జగన్ నడుస్తున్నారన్నారు.  


ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు కన్నా. 4 లక్షల మందికి ఉద్యొగాలు ఇచ్చినప్పుడు లేని ముహూర్తం ఇసుక మీద ఎందుకన్నారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లొ వరద ఎక్కడుందని ప్రశ్నించారు. వరద లేని ప్రాంతాల్లో కొరత ఎందుకుందని ప్రశ్నించారు. చనిపోయిన కార్మికులకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన  డిమాండ్ చేశారు. 


ఇసుక రాజకీయ పార్టీలకు ఆదాయ మార్గంగా మారిందన్నారు మాజీ మంత్రి మాణిక్యాలరావు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలపై దాడులు పెరిగాయని ఐదు నెలల్లోనే వైసీపీ పాలనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వరద వల్ల ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పడం అసమర్ధతకు నిదర్శనమన్నారు. తమ కార్యకర్తలపై వైసీపీ దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు జూన్ నెల నుంచి 10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా పాలిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని గత ఎన్నికలే దానికి నిదర్శనమని మాణిక్యాల రావు అన్నారు. అధికారంలొకి వచ్చిన అరునెలల్లో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని విమర్శించారు కేంద్రమాజీ  మంత్రి పురంధరేశ్వరి. 


8నెలల సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించామనీ...కానీ అధికారంలోకి వచ్చిన మొదట నుంచే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బీజేపీ పోరాటాలకు దిగిందన్నారు. 50 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా తాముంటామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: