ఆర్టీసీ కార్మికులతో సమ్మె విరమించే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం మంత్రివర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెనుద్దేశించిన మాట్లాడారు. మంగళవారం అర్థరాత్రి లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరిన కార్మికులను ప్రభుత్వం కాపాడుకుంటుంది తెలిపారు.కార్మికుల సమస్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది.

దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. కేసీఆర్ పిలుపు మేరకు కొందరు ఒక్కొక్కరిగా కార్మికులు విధుల్లో చేరుతున్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల జేఏసీ నాయకుడు అశ్వత్థమ రెడ్డి మాత్రం సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వరంగల్ రురల్ జిల్లాలోని పరకాల డిపో కార్మికులు మాత్రం డిమాండ్లు నెరవేరేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డ్యూటీలో చేరేది లేదని ప్రమాణం చేశారు.

మేము ఈ రోజుకి కి సమ్మె మొదలెట్టి 30 రోజులు అయినప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్చలకు పిలవకుండా బెదిరింపులతో ఇప్పటికి మూడవ సారి కార్మికులను తొలగిస్తామని బెదిరింపు మాటలతో కెసిఆర్ చెప్పడం జరుగుతుంది. ఆ మాటలను కార్మికులం మేము ఎవరూ విశ్వసించడం లేదు. రాష్ట్ర
జే.ఏ.సి నాయకుడు అశ్వత్థమ రెడ్డికి  ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ఆర్టీసీ కార్మికులు అందరూ కలిసికట్టుగా ఉండేదము.

ఇప్పటికైనా మా జేఏసి రాష్ట్ర నాయకులను ఆర్టీసీని రక్షించి మా కార్మిక కుటుంబాలను పరిశీలిస్తారని ప్రమాణం చేయుచున్నాము. అప్పటివరకు మేము ఎలాంటి డ్యూటీలకు వెళ్ళాము. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన రవీందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయున సంగతి తెలిసానిదే.

ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వచ్చేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పెంచారు. కండక్టర్ రవీందర్ మృతితో పరకాల ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలా ఆర్టీసీ కార్మికులు ప్రమాణం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్మికులు కలిసి ప్రమాణం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: