ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత నేపధ్యంలో భవన నిర్మాణ కార్మికులు కష్టాలు పడుతున్నారని వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే చేశారు. ఇసుక కొరత కారణంగా ఇంత మంది ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, మంత్రులు జీతాలు తీసుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు. అలాగే జగన్ సరిగా పరిపాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటాను అంటూ పవన్ వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య అందరిని విస్మయానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కులాల ప్రస్తావన ఎక్కువైపోయింది అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. అసలు ఈ మాట మాట్లాడటానికి ఆయనకు అర్హతా ఉందా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గాని ఆయన అన్న చిరంజీవి గాని పోటి చేసింది కాపు సామాజిక వర్గం 60 శాతం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది.


ఇక ఆయన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల్లో కాపు సామాజిక వర్గం వారే అధికంగా ఉంటారు. సోషల్ మీడియాలో గాని బయట గాని పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికే వాళ్ళలో ఎక్కువగా ఉండేది కాపు సామాజిక వర్గం వారే. ఆయన కీలక పదవి ఇచ్చిన తోట చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గం నేత. ఇక చిరంజీవి స్నేహం చేసిన గంటా శ్రీనివాసరావు వంటి వారు కూడా కాపు సామాజిక వర్గం వారే... ఆయన విమర్శించిన, అయన లైఫ్ ఇచ్చామని చెప్తున్న నేతలు కూడా కాపు సామాజిక వర్గం వారే, ఇవన్ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన ఎక్కువైందని మాట్లాడటం నిజంగా విడ్డూరం.


మరింత సమాచారం తెలుసుకోండి: