ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యడర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏరికోరి తెచ్చుకున్న సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అనూహ్యంగా మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎందుకు బదిలీ చేశారనేది జనాన్ని రాజకీయవేత్తలను కుదిపేస్తుండగా - బదిలీకి దారితీసిన కారణాల కోసం వెతుకు తున్నారు. కావాలనే సీఎస్‌ ను బదిలీ చేశారా ? సీఎస్ బదిలీ వెనుక ఇంత చాకచక్యంగా సిఎం పావులు కదిపారా? ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వెనుక జగన్మోహన రెడ్డి మాస్టర్ ప్లాన్ వేరేఏదైనా ఉందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది.


ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి ముందుగానే సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది. దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబు వ్యతిరేకించినట్లే, ఎల్వీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు మొదలయ్యాయి. ఆయన అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్' తో సత్సంబందాలు ఉన్నాయి. దీంతో బీజేపీ - వైసీపీ కలిసి తమని ఇబ్బంది పెడుతున్నాయని టీడీపీ నాయకత్వం గతంలో  ఆరోపించింది.

ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ విస్పొటన విజయంతో అధికారం లోకి వచ్చింది. వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎం అవ్వడం ఆ తరవాత కూడా సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు. ఇప్పుడు ఐదు నెలల తరువాత ఎల్వీ సుబ్రహ్మణ్యంని నేడు సీఎస్ పదవి నుండి బదిలీ చేశారు. అయితే దీని వెనుక జగన్‌ కు బలమైన కారణం ఉన్నట్లు అభిఙ్జవర్గాల సమాచారం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలు కారణంగానే ఆయనను తప్పించారని వాదన తెరపైకి వచ్చింది. 


ఏపీలో చీమ చిటుక్కుమన్నా ఆ విషయం నేరుగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరెస్సెస్ కు చేరవేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో ఆ వార్తలు అటునుంచి అటే ఎలాగో బీజేపీకి చేరుతున్నాయి. అంతేకాదు ఆరెస్సెస్- బీజేపీ కలిసి రాష్ట్రంలో వైసీపికి అడ్డుకట్ట వేసే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా సీఎం జగన్ కు అందిందట.


కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతల అంతర్గత సంభాషణలు జగన్మోహన రెడ్డి చెవికి చేరటంతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముందు సీఎస్ గా ఎల్వీని తప్పిస్తే, ఏపీ వ్యవహారాలు, ఆరెస్సెస్- బీజేపీలకు చేరడం ఆగుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నెమ్మదిగా పక్కా ప్రణాళిక రచించి బీజేపీని ఢీ కొట్టాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH - AMRAVATI' target='_blank' title='ap-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ap</a> CS LV Subramanyam & IYR <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KRISHNA' target='_blank' title='krishna -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>krishna </a>Rao

ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి కప్పుడు సీఎస్‌ను బదిలీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుందనే అంశం అటు హస్థినలో ఇటు అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. సీఎస్‌ను ఆయన కిందిస్థాయి అధికారి బదిలీ చేయడంపై కూడా వివాదాస్పదంగా మారుతోంది. అయితే ఏపీ సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.


ముఖ్యమంత్రికి సీఎస్‌ను తప్పించే అధికారం ఉన్నప్పటికీ, ఈ తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అన్నారు. బాధ్యతలేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమనం కావచ్చని అయితే ఇంకా మరీ దారుణం అని అవమానకరం అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసింది మాజీ సీఎస్ ఐవైఆర్ కావడంతో, విమర్శలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బీజేపీ నాయకుడు కావడం వల్లే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. అంటే ఇక ఏపిలో బీజేపిని వైసీపి ఢీ కొట్టనుందా! ఆలోచించాల్సిన విషయమే! 

మరింత సమాచారం తెలుసుకోండి: