మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి 10 రోజులైంది.  ఇప్పటి వరకు ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు.  ఎవరికీ ప్రజలు సరైన మెజారిటీ ఇవ్వలేదు.  సరైన మెజారిటీ ఇవ్వకపోవడంతో.. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవడానికి సిద్ద పడటం లేదు.  బీజేపీ, శివసేన పొత్తు పెట్టుకోవాలి.  బీజేపీతో పొత్తు అంటే శివసేన ముఖ్యమంత్రి పీఠం అడుగుతున్నది.  కానీ,  బీజేపీ ససేమిరా అని చెప్తున్న సంగతి తెలిసిందే.  


శివసేన మరో మార్గం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల దగ్గరకు వెళ్తున్నది. ఆ రెండు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అని చెప్పేందుకు శివసేన రెడీ అవుతున్నది.  ఇలా చేయడం వలన శివసేన తాత్కాలికంగా లాభ పాడొచ్చేమోగాని లాంగ్ టర్మ్ లో అది చాలా డేంజర్ అనే విషయం శివసేన గుర్తుంచుకోవాలి.  తాత్కాలికంగా బలపడేందుకు పదవిలో కొడుకు ఆదిత్య థాకరే ను కూర్చోపెట్టేందుకు తొందరపడితే.. దాని వలన ఆదిత్య థాకరే లాంగ్ టర్మ్ రాజకీయ జీవితానికి ఎసరుపడే అవకాశం ఉంటుంది.  


రాజకీయాల్లో ఎవరు ఎవరికీ శాశ్వత మిత్రులు కారు.  దానికి శివసేన.. బీజేపీనే ఉదాహరణలుగా చెప్పాలి.  ఎందుకంటే, రెండు పార్టీలు గత 31 ఏళ్లుగా కలిసి ఉన్నాయి.  కానీ, ముఖ్యమంత్రి పీఠం విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో అన్నదమ్ముల కొట్లాడుకుంటున్నారు.  విడిపోతున్నారు.  శివసేన ఎప్పటికైనా బీజేపీతోనే కలిసి ఉంటుంది.  


కొన్ని రోజులు ఇలా కొట్లాడుకున్నా.. చివరకు ఎవరో ఒకరు మెత్తపడతారు.  దారికి వస్తారు.  ఇద్దరు అలానే ఎదురు చూస్తున్నాయి.  శివసేన వస్తుందని బీజేపీ, బీజేపీ వస్తుందని శివసేన ఎదురు చూస్తున్నాయి.  ఎదురు చూపులే తప్పా అడుగులు ముందుకు పడటం లేదు.  ఇప్పుడు మహారాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్నది తెలియడం లేదు.  పదిరోజులౌతున్నా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు అంటే.. ప్రజల్లో అసంతృప్తి మొదలౌతుంది.  దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: