ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఫుల్ వేడి వేడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఒకేసారి వైసీపీ పై దాడి చేస్తున్నాయి. మీరు ఎంత మంచి చేసిన సరే మేము మిమ్మల్ని విమర్శించకుండా ఉండము .. అన్నట్టు ప్రతిపక్షా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ నిన్న వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించాడు. 


అయితే ఈ లాంగ్ మార్చ్ కి వచ్చిన జన సైనికులు అంత డబ్బులు తీసుకొని వచ్చారని, వారికి డబ్బు ఇవ్వకపోవడంతో గుట్టు రట్టు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో భీమవరంలో డబ్బులు విచ్చలవిడిగా పంచారని.. కానీ గెలవలేకపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


నిన్న వైజాగ్ సముద్ర తీరేనా.. పవన్ కళ్యాణ్ పెద్ద డ్రామాకు తెరలేపిన సంగతి తెలిసిందే.. నేను ఎవరికి దత్తపుత్రుడు కాదని.. కేవలం ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడు అని చెప్పడం పెద్ద జోక్ గా మనం వినచ్చు.. ఎందుకంటే... అతను ఎవరితో తిరుగుతున్నాడు.. ఎలా తిరుగుతున్నాడు అనేది అందరికి తెలిసిందే అంటూ ఎమ్మెల్యే చెప్పారు. 


అయితే ఈ మీడియా సమావేశంలో మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడిన డబ్బు తీసుకోకండి, సారాకు ఓటు అమ్మకండి అని నీతి మాటలు చెప్తాడు. కానీ భీమవరంలో డబ్బు పంచడం మొదలు పెట్టిందే పవన్ కళ్యాణ్.. ఆ డబ్బులు కూడా చంద్రబాబు పంపించినవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


కాగా 2 లక్షల నలబై ఓటర్లకు ఒకొక ఓటుకు వెయ్యి రూపాయిలు పంచాడు.. దానికి జన సైనికులే సాక్ష్యులు అని అయన వ్యాఖ్యానించారు.  కాగా అయన గుండెలపైనా చెయ్యి వేసుకొని చెప్పమనండి.. అతను నిజంగా నీతి నిజాయితితో ప్రజలకు సేవ చెయ్యడానికి వచ్చానని చెప్పగలర ? ఎన్నికల్లో డబ్బులు పంచలేదని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. మరి ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: