మరో వారం పదిరోజుల్లో దేశంలో ఓ సంచలనం జరగబోతున్నది.  ఆ సంచలనం మరేదో కాదు.. అయోధ్య కేసులో తీర్పు.  ఈనెల 17 వ తేదీలోగా తీర్పు వెలువడాల్సి ఉన్నది.  ఆ తేదీ దాటితే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది.  అందుకే ఈ కేసులో తీర్పు చెప్పడం కోసమే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి ప్రత్యేక బెంచ్ ను రేపుతూ చేసి ఆగష్టు 5 వ తేదీ నుంచి అక్టోబర్ 16 వ తేదీ వరకు వాదనలు విన్నారు.  దాదాపు 40 రోజులపాటు వాదనలు విన్నారు.  


అక్టోబర్ 16 వ తేదీ సాయంత్రం నిర్ణిత గడువు కంటే ముందుగానే వాదనలు ముగిశాయి.  నాలుగు వారాల్లోగా తీర్పు వెలువడాల్సి ఉన్నది.  కాగా, ఈరోజు నుంచి సుప్రీం కోర్టు తిరిగి ప్రారంభమైంది.  ఈరోజు నుంచి లెక్కేసుకున్నా సరిగ్గా పదిరోజుల్లో తీర్పు బయటకు వస్తుంది.  ఈ పదిరోజులపాటు అయోధ్యలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.  అసలే కార్తీకమాసం.  ఈ మాసం హిందువులకు పరమపవిత్రమైన మాసం.  


ఈ మాసంలోనే తీర్పు వెలువడబోతున్న తరుణంలో అసలు ఏం జరగబోతుందనే టెన్షన్ లో ఉన్నారు అందరు.  ఎవరికీ అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాలని ప్రభుత్వం చెప్తున్నది.  తీర్పు వెలువడటానికి రెండు మూడు రోజుల ముందు నుంచే అయోధ్యలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఎందుకంటే...అయోధ్య తీర్పు కోసం  యావత్ భారతదేశం మొత్తం ఆసక్తి ఎదురుచూస్తుంది.  


ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖచ్చితంగా బలగాలను మోహరిస్తారు.  ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో ఈ బందోబస్తు ఎక్కువగా ఉంటుంది.  అటు ముంబై, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపుగా ఇదేవిధమైన బందోబస్తు ఏర్పాటు  చెయ్యొచ్చు.  ఇప్పటికే ఈ దిశగా యూపీ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. యూపీ మంత్రులు, బీజేపీ నాయకులు ఎవరు కూడా అయోధ్య విషయంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని హుకుం జారీ చేసింది.  ఎవరూ తప్పుగా మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: