కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించడంలో ఎయిర్‌టెల్ ఎప్పుడూ ముందుంటుందని నిరూపిస్తూ ఒక మంచి ఆఫర్‌ను వినియోగదారులకోసం ప్రకటించింది భారతి ఎయిర్‌టెల్‌ సంస్ద.. ఇందుకు గాను వినియోగదారుల కోసం రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అందుకోసం రూ.599 ప్లాన్‌  రీచార్జ్‌ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఎయిర్‌టెల్‌ జతకట్టింది.


ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్‌టెల్  ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు  ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. ఇకపోతే భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ సేత్ మాట్లాడుతూ, ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని, ఎయిర్‌టెల్‌తో తాజా డీల్ వల్ల దేశంలో ఇన్సూరెన్స్ సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇకపోతే తొలి రీచార్జ్ చేసుకున్న తర్వాత కస్టమర్లు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటగా రీచార్జ్ చేసుకున్న తర్వాత ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్సూరెన్స్ సేవలు పొందటానికి వీలవుతుందని తెలిపారు.


ఇదే కాకుండా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ రిటైలర్ వద్దకు వెళ్లి కూడా ఇన్సూరెన్స్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం 18 నుంచి 54 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే లభిస్తాయని పేర్కొన్నారు.. ఈ సౌలభ్యం పొందడానికి వైద్య పరీక్షలు కానీ, డాక్యుమెంట్లు కానీ అవసరం లేదు. ప్రస్తుతం ఈ సేవలు తమిళనాడు, పాండిచెర్రీ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సంస్ద ప్రతినిధులు తెలిపారు. ఇకపోతే రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తుంది. ఈ ప్లాన్‌ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్‌గా కొనసాగుతుందని పేర్కొన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: