ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే రాజకీయాల్లో ఏ నాయకుడైనా పైకి రాగలరు. అలా కాదంటే రాజకీయాల్లో వారి మనుగడ కష్టమని చెప్పాలి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ పరిస్థితి అలానే ఉందని చెప్పాలి. గత ఎన్నికల ఓటమి నుంచి పవన్ ఏమి నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా నిన్న జరిగిన భహిరంగ సభలో పవన్ స్పీచ్ వింటే అర్ధం అవుతుంది. రాజకీయాల్లో పవన్ నిలబడటమే కష్టమేనని. తనకొక భావజాలం ఉందంటూనే .. అర్ధం పర్ధం లేకుండా చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా ఏదేదో చెబుతున్నారు. తన స్పీచ్ లో ఎక్కడ లేని సెల్ఫ్ డబ్బా ప్రతి పదంలో కనిపిస్తుంది. తన స్థాయేంటో ప్రజలు ఎన్నికల్లో చూపించిన ఇంకా పవన్ ప్రగల్బాలు పలుకుతూనే ఉన్నారు. నిజానికి ఒక స్థాయి ఉన్న నాయకులెవరు కూడా ఇంతలా డబ్బా కొట్టుకోరు. మనం జగన్ .. చంద్రబాబు స్పీచ్ లు చూశాము.


వారి రేంజ్ ఏంటో ప్రజలకు తెలుసు .. ఇంకా చెప్పాలంటే దేశానికీ కూడా తెలుసు. కానీ వాళ్లెవరు కూడా పవన్ మాదిరిగా సభలో తమ గురించి గొప్పలు చెప్పుకోరు. నిన్న జరిగిన సభలో పవన్ స్పీచ్ ను గమనిస్తే మాటకు ముందు మాటకు తరువాత మోడీని కలుస్తా .. మోడీకి తానంటే ఏంటో ఇష్టమని తెగ చెప్పుకున్నారు. నిజానికి పవన్ అపాయింట్మెంట్ అడిగితే మోడీ ఇస్తాడో .. ఇవ్వడో రాష్ట్రంలో జనాలందరికీ తెలుసు. కానీ పవన్ మాత్రం వీర గొప్పలు చెప్పుకుంటారు. 


వెనకటికి ఒక సామెత ఉంది. నిండు కుండ తొణకదని .. ఏమి లేని కుండే ఎగిరెగిరి పడుతుందని. ఇప్పుడు ఈ సామెత పవన్ విషయంలో ఖచ్చితంగా సరిపోతుంది. మొన్నటికి మొన్న కేసీఆర్ తో కలుస్తానని పవన్ చెప్పుకొచ్చారు. నిజంగా కేసీఆర్ గాని అపాయింట్మెంట్ ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని పవన్ గారు పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. ఇక మోడీకి తాను ఎంతంటే అంత అని గొప్పలు చెప్పడం కూడా చూశాము. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: