కేసీఆర్  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండావారి ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించడంతో చివరకి కేసీఆర్ కి సెల్ఫ్ గోల్ మాదిరిగా మారింది. మీ ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఎవరు లెక్కచేయలేదు. దీనితో కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వి జనాల్లో పరువును పోగొట్టుకుంటున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో  కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించారు. నవంబర్ 5వ తేదీన అర్ధరాత్రి లోపల రిపోర్ట్ చేయకపోతే తమ ఉద్యోగాలు పోతాయని హెచ్చరించిన సంగతీ తెలిసిందే. అయితే కేసీఆర్ హెచ్చరికలకు ఎవరు పెద్దగా భయపడినట్టు కనిపించడం లేదు. కేసీఆర్ వార్నింగ్ కు కార్మికులు భయపడి తిరిగి తమ తమ ఉద్యోగాల్లో చేరతారని అందరూ భావించారు.


కానీ కార్మికులు మాత్రం వెనకడుగు వేయటం లేదు. ఇప్పటీకే వరకు వెనక్కి వచ్చిన కార్మికులు కేవలం 12 మంది మాత్రమే. వాళ్ళు కూడా పదవీ విరమణకు దగ్గర పడిన వారు కావడం గమనార్హం. కేసీఆర్హెచ్చరికలతో ఎక్కువ మంది తిరిగి ఉద్యోగాల్లో చేరతారని భావించిన ప్రభుత్వానికి ఇది గట్టి షాక్ అని చెప్పాలి. నిజానికి హుజూర్ నగర్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన తరువాత కేసీఆర్ఇంకా స్వరం పెంచినారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయి ఉంటే కేసీఆర్ ఆత్మ రక్షణలో పడి ఉండేవారు. కానీ విజయం వరించడంతో కేసీఆర్ ఇంకా రెచ్చోయిపోయి మాట్లాడ్తున్నారు. 


ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పిలిచి మాట్లాడాల్సింది పోయి .. ఆర్టీసీ ఖతం అయ్యిందని .. కార్మికుల ఉద్యోగాలు పోయాయని వారికి మళ్ళీ ఉద్యోగం కావాలంటే ధరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఎంతో హేళనగా మాట్లాడినారు. ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే ఆరేడు వేల బస్సులకు పర్మిట్ ఇస్తామని దీనితో ఆర్టీసీ ఇక ఉండదని .. కార్మికులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజానికి ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో చాలా చేటు చేస్తాయని కేసీఆర్ తొందరగా గ్రహిస్తే మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: