గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారుపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్ లకు ఫిర్యాదు చేస్తానంటున్నారు ఆమె అత్తగారైన వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాజకీయాలకు పట్టిన చీడపురుగు చంద్రబాబు అని, ఐదేళ్లు రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకున్నాడన్నారు. తండ్రీకొడుకులిద్దరూ రహస్యంగా జీవోలు విడుదల చేసి రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశీ పర్యటనల పేరుతో వాటిని తరలించారన్నారు.


రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయిందని, ప్రజా పాలన అనే పదానికి నిర్వచనం చెబుతూ సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలిస్తున్నాడని లక్ష్మీ పార్వతి చెప్పారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తానన్నారు. ఐదు నెలల్లో ఇంత పారదర్శకపాలన దేశంలో ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఐదు సంవత్సరాలు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దేశంలోనే ఆంధ్రరాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడన్నారు. ఏపీలో పరిస్థితి అతిదారుణంగా ఉన్నాయని, ఏపీ కంటే బిహార్‌ వెయ్యి రెట్లు బెటర్‌ అని జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పాడని లక్ష్మీ పార్వతిగుర్తు చేశారు.


చంద్రబాబు 6,17,585.19 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వైయస్‌ఆర్‌ సీపీ పుస్తకం కూడా రిలీజ్‌ చేసిందని లక్ష్మీ పార్వతి అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ కూడా ఒక నివేదిక ఇచ్చిందన్నారు.


రహస్యంగా వందల జీఓలు విడుదల చేసిన తండ్రీకొడుకులు ఫ్యామిలీ టూర్‌ పేరుతో దోపిడీ చేసిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారన్నారు. డబ్బు ఎక్కడ దాచారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తాను చంద్రబాబు అవినీతిపై వేసిన కేసు ఏసీబీలో ప్రస్తుతం విచారణ జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో స్టే ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. 14 ఏళ్ల పాటు స్టే మీద ఉన్న కేసు ప్రస్తుతం ఏసీబీ విచారణ చేస్తుందన్నారు. చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు కూడా లేఖ రాస్తానని లక్ష్మీపార్వతి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: