ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలలో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. 15వేల రూపాయలు ప్రభుత్వం ఈ పథకం కింద అందించనుంది. 
 
ఈ పథకం కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తిస్తుంది. తల్లికి, ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న కుటుంబంలోని పిల్లలకు ఆధార్ కార్డ్ ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన తెల్లరేషన్ కార్డ్ ఉండాలి. 6దశల్లో అధికారులు రేషన్ కార్డ్ లోని సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. కనీసం 75% హాజరును విద్యార్థులు కలిగి ఉండాలి. మధ్యలో చదువును పిల్లలు నిలిపివేస్తే ఆ విద్యాసంవత్సరానికి ఈ పథకానికి అనర్హులు. 
 
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సంస్థల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అమ్మఒడి పథకానికి అర్హులు కాదు. ప్రభుత్వం ఈ పథకం కోసం ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ఏర్పాటు చేసి స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ వెబ్ సైట్ కు లింక్ చేస్తారు. అధికారులు పరిశీలన అనంతరం నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. 
 
అర్హులైన ప్రతి లబ్ధిదారు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసు బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి. లబ్ధిదారుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో 15 వేల రూపాయలు జమ అవుతుంది. గ్రామ వాలంటీరు తనకు కేటాయించిన ఇళ్లలోని తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడిని గుర్తించాలి. వారి వివరాలను సేకరించి ఎంఈఓలకు సమర్పించాలి. సంబంధిత అధికారులు, లబ్ధిదారులే పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా బాధ్యులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: