ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముచ్చట మూన్నాళ్లుగానే సాగింది. ఇకపోతే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పై వేటు వేసిన విషయం తెలిసిందే . ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


గత కొంత కాలంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం,  సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తాయని. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ నవంబర్ 1న సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఏకంగా సీఎంవోలోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు ఓ మెమో జారీ చేసి, వారంలోగా దీనిపై  వివరణ ఇవ్వాలని ఆదేశించిన తరువాతే ఇతని బదిలి జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంచితే వైసీపీ అధినేత వైఎస్ జగన్  సీఎంగా పదవి చేపట్టిన వెంటనే తన కేబినెట్ లో ఏకంగా ముగ్గురు మహిళలకు చోటిచ్చారు, వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టగా, మరో మహిళకు ఏకంగా రాష్ట్ర హోం మంత్రి పదవిని ఇచ్చేశారు.


తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అయిన మహిళా అధికారి నీలం సహానీని ఎంపిక చేశారు. ప్రస్తుత సీఎం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ స్థానం నుంచి బదిలీ చేసిన జగన్ సర్కారు... ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానీని ఉన్నపళంగా అమరావతికి రప్పించిందట.. ఇక  నీలం సహానీ కెరీర్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఏపి ప్రభుత్వం తనకు అప్పజెప్పిన ఏ పనిని అయినా సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఏమాత్రం అలసత్వం వహించదని, గ్రహించిన కారణంగానే కొత్త  సీఎస్ అధికారిగా నీలంను ఎంపిక చేసామని వెల్లడించారు.


ఇక ఇప్పటికే తన కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులతో పాటు ఓ డిప్యూటీ సీఎం పోస్టు హోం శాఖ సహా కీలక శాఖలు అప్పగించిన జగన్... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా మహిళా అధికారికి కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: