ప్రకృతిని మనం ప్రేమిస్తే.. అది మనల్ని కాపాడుతుంది.  ఇది సత్యం.  వృక్షో రక్షో రక్షతి అంటారు.  అందుకే చెట్లను పెంచాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి.  చెట్లను పెంచుకున్నా.. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయకున్నా దానివలన వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు.  చాలా ఇబ్బందులు వస్తాయి.  ఆ ఇబ్బందుల కారణంగా వచ్చే నష్టాలు కూడా అధికంగా ఉంటాయి.  


1996 నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వైఫల్యాల కారణంగా షాంగై సహకార సంస్థల దేశాలలో మూడు లక్షలమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు హోమ్ శాఖామంత్రి అమిత్ షా పేర్కొన్నారు.  ఢిల్లీలో షాంగై సహకార సంస్థ దేశాల సదస్సు జరిగింది.  ఈ సదస్సులో ప్రపంచంలో వస్తున్న మార్పులు, ప్రకృతిలో వస్తున్న మార్పులు తదితర విషయాలపై చర్చించారు.  ప్రకృతి కారణంగా వచ్చే మార్పుల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.  


ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై అంశాలపై చర్చ జరిగింది.  ప్రకృతీ వైఫల్యాల నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇందులో చర్చించారు.  కొన్ని నియమాలను నిర్ణయించారు.  అన్నింటితో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.  అంతేకాదు, ఈ విషయంలో ఎలా సహకరించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే వాటిపై కూడా చర్చించినట్టు సమాచారం.  


ఇక షాంగై సహకార సంస్థ దేశాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని, ఈ భూకంపాల కారణంగానే దాదాపుగా రెండు లక్షలమంది మర్ణయించినట్టు తెలుస్తోంది.  భూకంపాలే మరణాలకు కారణాలు అవుతున్నాయని ఈ సదస్సులో పేర్కొన్నారు.  భూకంపాల నుంచి ప్రజలను రక్షించుకోవడం ఎలా అనే దానిపై కూడా చర్చించారు.  భూకంపం వచ్చినపుడు ప్రజలు ఎలా బయటపడాలి అనే దానిపై ప్రజల్లో అవగాహనా తీసుకొచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ముఖ్యంగా భూకంపాల నుంచి రక్షణ పొందేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: