మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించడానికి చాలామంది ఇష్టపడతారు.  ఎందుకంటే అక్కడ ఉపాధి లభిస్తుంది.  ఉపాధి కోసం ఎక్కువగా వలస వల్లే  కూలీలు మెట్రో పాలిటన్ నగరాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అయితే, మెట్రోపాలిటన్ నగరాల్లో ఇటీవల కాలంలో పర్యావరణం దారుణంగా మారిపోయింది.  వాతావరణంలో మార్పులు కారణంగా గాలిలో ప్రమాదకరమైన వాయువులు ఎక్కువగా ఉంటున్నాయి.  


ఈ వాయువుల కారణంగా శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది.  వాయుకాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నది.  అక్టోబర్ 27 వ తేదీ తరువాత ఈ వాయుకాలుష్యం మరింత ఎక్కువైంది.  ఢిల్లీ నగరంలో ఈ స్థాయిలో వాయు కాలుష్యం పెరగడం ఇదే మొదటిసారి.  గతంలో కాలుష్యం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో లేదు.  గత కొన్ని రోజులుగా కాలుష్య నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నారు.  


ఫలితంగా కొంతమేర తగ్గింది.  అయినప్పటికీ ఈ కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పటిలో కోలుకునేలా కనిపించడం లేదు.  ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన హర్యానా,పంజాబ్, యూపీలో పంట వ్యర్ధాలను తగలబెట్టడమే అని అంటున్నారు.  పంట వ్యర్ధాలను తగలబెట్టడం వలన కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయినట్టు ఢిల్లీ అధికారులు చెప్తున్నారు.  


పంట వ్యర్ధాలను తగలబెట్టకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆ సమస్య నుంచి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు నిన్నటి రోజున ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి చురకలు అంటించింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.  సరి బేసి విధానం అమలు చేసింది.  ఈ విధానం కారణంగా ఉపయోగం ఉండదని, పొల్యూషన్ తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  ఢిల్లీ వెళ్ళడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు.  సినిమా షూటింగ్ లు కూడా అక్కడ జరగాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: