సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో  ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అకస్మాత్తుగా సీఎస్‌ను జగన్ ఎందుకు బదిలీ చేశారు? అందుకు దారితీసిన కారణాలేంటి?  కావాలనే సీఎస్‌ను బదిలీ చేశారా? ఎల్వీ బదిలీ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందా అనే అనుమానాలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. అయితే తాజాగా అందిన వార్త ప్రకారం ప్రభుత్వంలో ఉన్న లొసుగులను దృష్టిలో పెట్టుకుని కొందరు కీలక అధికారుల ద్వారా కుట్రలు చేస్తున్నారనే సమాచారం జగన్ కి అందిందని, దాంతో వెంటనే జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది.


అందుకే ఎన్నికల సంఘం నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంని జగన్ తప్పించారంటున్నారు. ఈ వాదన ఇలా ఉండగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాస్త ముందు గానే ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది. అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు రాగా ఎల్వీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు కూడా మొదలయ్యాయి.


అయితే ఇతని బదిలీకీ కారణం ఇవేమి కావట. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో సత్సంబందాలున్నాయని. వీటి మూలంగాగానే ఆయన పదవిపై వేటు పడిందని అంటున్నారు. ఈ సంబందాల కారణంగా ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్ కు చేరవేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో ఆ వార్తలు కాస్త అటునుంచి ఎలాగో బీజేపీకి చేరుతున్నాయి.


అంతేకాదు ఆరెస్సెస్- బీజేపీ కలిసి జగన్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా సీఎంకు అందిందట. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి వివరాలు మాత్రం  బయటకు రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: