పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ సూపర్ సక్సెస్ అయ్యింది.  సభ సైతం అద్భుతంగా జరిగింది.  సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  ఆలోచింపజేసింది.  కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడినా.. ఆ మాటల వెనుక అర్ధం ఉంది.  ఆవేదన ఉన్నది.. భవన నిర్మాణ కూలీలు మరణిస్తున్నారు.  ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం ఆగిపోయింది.  దానిపైనే ఆధారపడిన లక్షలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు.  అడ్డా పని తప్పించి మరేపని తెలియని వ్యక్తులు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  


ఇలా ఎన్నో జరుగుతున్నాయి.  ఇసుక కొరత కారణంగానే ఇలా జరుగుతున్నది.  ఇసుక కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ విషయంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ విశాఖ సభలో పేర్కొన్నారు.  అయితే, మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మాట అన్నారు.  భవన నిర్మాణ కార్మికులపై అంతటి ప్రేమ ఉంటె.. వారి కోసం సినిమా చేసి ఆ డబ్బును వాళ్లకు ఇవ్వవచ్చు కదా అని అన్నాడు.  


గత కొన్ని రోజులుగా పవన్ ను సినిమా రంగంలోకి తిరిగి తీసుకురావాలని ఒత్తిడి జరుగుతున్నది.  నిర్మాతలు, దర్శకులు పవన్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  ఈ ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉన్నది.  అటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుందని చెప్తున్నారు.  ఇన్నింటి మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా చేయడా అనే డౌట్ క్రియేట్ అయ్యింది.  కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా చేయడం పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు.  


ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా చేసి, అలా వచ్చిన డబ్బును భవన నిర్మాణ కార్మికులకు ఇస్తే.. కార్మికుల్లో పవన్ దేవుడు అవుతారు.  అధికారంలో లేకుండా, కనీసం ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించకుండా ప్రజల కోసం పని చేసిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు మెచ్చుకుంటారు.  అందులో సందేహం అవసరం లేదు.  మరి ఈ దిశగా పవన్ కళ్యాణ్ అలోచించి సినిమా చేస్తే.. దాని వలన నిర్మాతలు సంతోషిస్తారు.. అటు భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపినట్టు అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: