ప్రతి సభలో పవన్ కళ్యాణ్ తనంటే మోడీకి చాలా ప్రేమని బిల్డప్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. నిన్న జరిగిన జనసేన భహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తనంటే మోడీకి చాలా ప్రేమని .. తనను ప్రేమగా పిలుస్తారని ఎక్కడ లేని గొప్పలు చెప్పుకున్నారు. నిజమే 2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మీద మోడీకి చాలా ప్రేమ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు పవన్ ప్రజాబలమేంటో మోడీకి తెలియదు కాబట్టి. ఇప్పుడు పవన్ ప్రజాబలమేంటో మోడీతో పాటు అందరికీ తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఘనమైన చరిత్ర ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. మరి ఇలాంటి పరిస్థితిలో పవన్ ను మోడీ ఎందుకు దగ్గరికి తీసుకుంటారు. 


అయితే 2019 ఎన్నికల ముందు మోడీని .. బీజేపీని విమర్శించిన పవన్ గారు ఇప్పుడు మాత్రం మోడీకి తానంటే ప్రేమని ఢిల్లీకెళ్లి కలుస్తానని చెప్పడం యెక్క అంతర్యం ఏంటి ? బీజేపీ సాన్నిహిత్యం కోసం పవన్ గారు పాకులాడుతున్నారా ? ఇంకొక పక్క పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు బీజేపీ పార్టీ రాదని ఛీ కొట్టింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ డబ్బా కొడుతున్నారు. నిన్న పవన్ గారు చెబుతూ నేను మోడీని కలుస్తానని గట్టిగా .. ఆవేశంగా చెప్పారు.


రాష్ట్రంలో ఇసుక సమస్య ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరైనా కలుస్తారు. ఢిల్లీకి వెళ్ళి పీఎం ను కలిస్తే ఉపయోగమెంటో పవన్ చెబితే బాగుండు. అయితే పవన్ ప్రజాబలమేంటో తెలిసిన తరువాత పవన్ నిజంగా ఢిల్లీకి వెళితే మోడీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడీకి తిక్క రేగితే సీఎం కే అపాయింట్మెంట్ ఇవ్వని మొండి ఘట్టం. అలాంటింది పవన్ కళ్యాణ్ ఒక లెక్కనా . 

మరింత సమాచారం తెలుసుకోండి: