మహారాష్ట్ర ఎన్నికలు ముగిసి చాలారోజులైంది.  ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.  ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ, శివసేన పార్టీలు ఎన్నోమార్లు చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది.  చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను రెండు పార్టీలు చర్చించినా.. కీలకమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.  


రెండు పార్టీలు తమకు మహా పీఠం కావాలి అంటే తమకే మహాపీఠం దక్కాలి అని పట్టుబడుతున్నారు.  ముప్పై నెలలు శివసేన, మరో ముప్పై నెలలు బీజేపీ పీఠంపై కూర్చోవాలని శివసేన అంటోంది.  మొదటి ముప్పై నెలలు తమకే పీఠం ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది.  ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది.  ఇప్పుడు అది కూడా ఇవ్వమని చెప్తున్నది.  


మధ్యేమార్గం కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ రెబల్స్ దాదాపుగా 17 మంది ఉన్నారు.  ఈ 17 మందిని బీజేపీ మంచి చేసుకోవడానికి రెడీ అయ్యింది.  ఈ 17 మంది బీజేపీతో చేతులు కలిపితే దాదాపుగా 122 బలం అవుతుంది.  అలానే ఇప్పటికే  మహారాష్ట్ర స్వాభిమాన్ పార్టీ మద్దతు ప్రకటించింది. తలచుకుంటే ఇతరపార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం పెద్ద విషయం కాదు.  చివరి అస్త్రంగా బీజేపీ అది చెయ్యొచ్చు.  


అధికారాన్ని మాత్రం మహారాష్ట్రలో కోల్పోయేందుకు బీజేపీ సిద్ధంగా లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.  ఇక ఉద్దవ్ కు  అత్యంత సన్నిహితుడైన కిషోర్ ఆర్ఎస్ఎస్ కు లేఖ రావడం, ఆ లేఖలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మహారాష్ట్రకు రప్పిస్తే..మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు సులభం అవుతుందని చెప్పడం వెనుక అర్ధం ఏంటో తెలియడం లేదు.  నితిన్ గడ్కారీ వస్తే.. ఈ సమస్య రెండు గంటల్లో పరిష్కారం అవుతుందని చెప్పడంతో బీజేపీ శ్రేణులు షాక్ అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: