జగన్ ప్రభుత్వం ఐదు నెలల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ ఐదు నెలల కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు జగన్ తీసుకున్నారు. లక్షల కొద్దీ ఉద్యోగాలు .. ఎన్నికల హామీలో తాను ఇచ్చిన నవరత్నాల విషయాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న తీరు జనాల్లో జగన్ ప్రభుత్వానికి ఎక్కువ మైలేజీ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుండటంతో ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇసుక వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువయిందన్నా మాటల్లో నిజం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి పక్షాలకు ఏది దొరకలేదు కాబట్టి ఇసుక మీద పడ్డారని కొంత మంది ఆరోపిస్తున్నారు. 


జగన్ ఇప్పటి వరకు అమలు చేస్తున్న పధకాలు జగన్ ను ప్రజల్లో సరికొత్త ఇమేజే ను తీసుకొచ్చిందని చాలా మంది చెబుతున్నారు. ఉన్న ఊరిలో వీధికి ఒకట్రరెండు ఉద్యోగాలు సృష్టించడం జనాల్లో జగన్ కి బాగా పాజిటివిటీ పెంచింది. వివిధ రకాల రోగులకు ఇస్తున్న పింఛన్లను భారీ ఎత్తున పెంచడం కూడా కలిసి వస్తోంది. వృద్ధులు వితంతువులకు కూడా పింఛన్ను పెంచడం ప్లస్ అయిందని అంటున్నారు.అదే సమయంలో నెలకో సరికొత్త కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు.


ఇప్పటికే దేశంలో ఎవరు చేయని విధంగా లక్షల్లో యువతకు ఉద్యోగాలు కల్పించారు. మరి కొన్ని రోజుల్లో అమ్మ ఒడి పధకానికి అంతా సిద్ధం అయ్యింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నారు. ఇలా  ఒక్కొక్కటి బలమైన పిల్లర్లు వేసుకుం టూ వెళ్తున్నారు. జగన్ చేస్తున్న పనులు కళ్ల ముందు కనపడటం అనేది మోస్ట్ పాజిటివ్ క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో ఇసుక మాత్రమే కాదు.. ఇప్పట్లో ఇంకో రెండు మూడు పెద్ద సమస్యలు వచ్చినా జగన్ ని కదిలించలేవనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: