ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న ఘోరాలను చూస్తుంటే, భవిష్యత్తులో వారికి ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించబోతున్నాయోనని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు సమాజంలో పరిస్దితి ఎలా ఉందంటే తన నీడను చూసి కూడా ఆడపిల్లలు భయపడే పరిణామాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడవలసిన వారే కాలయముల్లా మారుతున్నారు. తోడపుట్టిన వారే తోడేళ్లై వెంబడిస్తున్నారు. బందాలకు విలువ ఇవ్వకుండా, కన్న పేగును కూడా తన కామానికి బలి చేస్తున్నారు. ఇలాంటి హేయమైన చర్యలు రోజు రోజుకు పెట్రేగి పోతున్నాయి.


సమాజంలో ఇప్పుడు ఈ నీఛమైన పనులు యదేచ్చగా కొనసాగిస్తున్నారు కొందరు కామాంధులు. ఇక ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని శివపూర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇతన్ని మనిషి అనడం కంటే మృగం అనడం కరక్టేమో అనిపిస్తుంది. సుమారుగా 40 ఏళ్ల వయస్సులో  ఉన్న ఈ వ్యక్తి తన 16 ఏళ్ల పెద్దకూతురి మీద అత్యంత దారుణంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె మీద ఏడాదిన్నరగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడట.. అదీ ఎంత నీచంగా అంటే ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి లైంగికదాడి చేస్తున్నాడట.. అంతే కాకుండా ఆ దృష్యాలను వీడియోలు కూడా తీసాడని తెలిసింది.


అత్యంత మూర్ఖునిగా ప్రవర్తించే తన భర్త ప్రవర్తన నచ్చక అతడి భార్య కొన్నాళ్ల క్రితమే తన ముగ్గురు పిల్లలను, భర్తను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడు తన 16 ఏళ్ల పెద్దకూతురి మీద లైంగికదాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను తన చిన్నకూతుళ్లు చూపిస్తూ, ఈ విషయం ఎవరికైనా చెబితే మీకు కూడా అలాంటి గతే పడుతుందని వారిని హెచ్చరించాడట.. ఇంతటి అమానుష చర్య బయటకు రావడానికి కారణం అతని చిన్న కూతురట. ఒకింట్లో  పనిపిల్లగా చేరిన ఏడేళ్ల చిన్నకూతురును మాటల్లో పెట్టి ఆ ఇంటి యజమానురాలు కూపీ లాగిందట.


దీంతో ఆ పిల్ల తన తండ్రి చేసే దురాగతాన్ని మొత్తం చెప్పుకుని కన్నీరుపెట్టుకుంది. ఈ విషయాన్ని ఆ ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆ తండ్రిని అరెస్ట్ చేశారు. అతడి పెద్దకూతురిని ఏమైందని ప్రశ్నించగా.. తొలుత విషయం చెప్పడానికి భయపడిన ఆ కూతురూ. తన తండ్రి తనను కొడతాడని మాత్రమే చెప్పిందట. అయితే, ‘మీ నాన్నను అరెస్ట్ చేశాం. భయపడాల్సిన పనిలేదు.’ అని పోలీసులు భరోసా ఇవ్వడంతో తాను అనుభవించిన నరకాన్ని మొత్తం బయటకు చెప్పుకొంది. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి షాక్‌లో ఉందని ఆమె ఆ షాక్ నుంచి కోలుకోవడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: