ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎస్ ఆకస్మిక బదిలీ రాష్ట్రం లో సంచలనం గా మారింది. ఎల్వీ సుబ్రమణ్యం తక్షణం చీఫ్‌ సెక్రటరీ పోస్టు నుంచి వైదొలగి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ సాధారణ  పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


సీఎస్ బదిలీ పై భిన్న వాదనలు వినపడుతున్నాయి.  సీఎస్ సీఎం జగన్ ఆదేశాలను భేఖాతరు చెయ్యడంతో సీఎం ఆగ్రహానికి గురైనట్లు సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఏ అధికారిని ఏ పోస్టులో నియమించాలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినా తనకు నచ్చడం లేదన్న కారణంతో ఆ నియామకాల్ని సీఎస్‌ పెండింగ్‌లో పెట్టడం ముఖ్యమంత్రిలో అసంతృప్తికి కారణమైందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సీఎస్ గా సుబ్రమణ్యం ఏడు నెలలు ఆ పదవిలో కొనసాగారు.


ఇక ఆంధ్రప్రదేశ్‌ తదుపరి సీఎస్‌గా నీలం సాహ్ని పేరు వినిపిస్తోంది.  సీఎస్‌గా నీలం సాహ్ని సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి అమరావతి వచ్చిన నీలం సాహ్ని  మధ్యాహ్న సమయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఐఏఎస్‌ల సీనియారిటీ జాబితాలోనూ నీలం సాహ్ని రెండో స్థానంలో ఉన్నారు. 

సీనియారిటీ పరంగానూ నీలం సాహ్నికి సీఎస్ గా నియమితులు అవ్వడానికి ఎక్కువ అవకాశం వుంది ఈ మేరకు సాహ్ని వైపే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: