తెలంగాణ రాష్ట్రం లోని రంగారెడ్డి జిల్లా అభుల్లాపూర్మేట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని షాక్ కు గురి చేసింది. అందరూ చూస్తుండగా పట్ట పగలు నిందుతుడు నేరుగా ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తహసీల్దార్ కాలి బూడిద అయ్యారు. ఈ ఘటనను తెలంగాణ సీఎం కెసిఆర్ ఖండించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ ఘటన తో విజయా రెడ్డి కుటుంబ సభ్యులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. 


విజయా రెడ్డి హత్య లో నిందుతుడు కూర సురేష్ అని తెలుస్తోంది. భూ వివాదం కారణంగానే విజయా రెడ్డి ని నిందితుడు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణ లో తెలుస్తోంది. బాచారం సమీపంలో తలెత్తిన భూ వివాదం కారణంగా నిందితుడు సురేష్ ఎమ్మార్వో పై దారుణానికి వడికట్టినట్లు తెలుస్తోంది.  ఇక సురేష్ పెదనాన్న దుర్గయ్య సురేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటపెట్టారు.

నిందితుడికి మతిస్థిమితం ఉండదని చెప్పారు కానీ ఇలాంటి ఘటనకు తెగపడతాడు అని ఎప్పుడు ఊహించలేదని సురేష్ పెదనాన్న తెలిపారు.మధ్యాహ్నం భోజనానికి రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది. ఎమ్మార్వోపై దాడి చేశాడని కొద్దిసేపటికి తెలిసిందని నిందుతుడి భార్య తెలిపింది.


తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సంఘాలు ఘటనను త్రీవంగా ఖండిచాయ్. హత్యకు కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు రెవిన్యూ ఉద్యోగులు. కరీంనగర్ జిల్లా లో మంత్రి గంగుల కమలాకర్ ను ఘెరావు చేసారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.విజయా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్ లో ఉద్యోగ సంఘాలు కాండిల్ ర్యాలీ చేసి విజయా రెడ్డి కి నివాళులుఅర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: