పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు మానేసి రెండేళ్లవుతోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ మళ్లీ రెండు సినిమాలు చేయడానికి అంగీకారం తెలిపాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఇటివల విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ తో పవన్ లో మళ్లీ డైలమాలో పడ్డాడని అంటున్నారు. ఏపీలో ఇసుక సమస్యపై పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పవన్ లో మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ఆలోచిస్తున్నాడని అంటున్నారు.

 


ఇసుక విధానంపై ఆయన గళమెత్తిన తీరు, పవన్ పిలుపుతో విశాఖకు వచ్చిన జనం, సభకు వచ్చిన స్పందన.. పవన్ ను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు చేసి పాటలు, డ్యాన్సులు, కామెడీ చేస్తే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందని కొందరి వాదన. రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ స్పీడు సినిమాల్లోకి వెళ్తే తగ్గుతుందనే భావన కొందరిలో ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీపై నమ్మకం లేకపోవడం.. వంటి పరిణామాలు ఉన్న సమయంలో జనసేన పార్టీని పవన్ మరింత బలోపేతం చేస్తే పార్టీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ సమయంలో సినిమాలు చేస్తే.. ప్రజల్లో పవన్ కు నిలకడ లేదు.. మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయాడు అనే భావన తెప్పించేకన్నా రాజకీయాల్లో స్థిరంగా ఉండి పోరాడుతున్నాడు అనే భావన కల్పించడమే బెటర్ అంటున్నారు.

 

  

పవన్ అన్నట్టు జగన్, అవంతి వంటి వారు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఉన్నారు. పవన్ సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయోచ్చు. కానీ సినిమాల్లో నటిస్తే అది వినోదం. తానే నటించాలి.. రాజకీయాలు చేయాలి. వ్యాపారం అయితే చూసుకోవటానికి కొందరుంటారు.. పైన నడిపిస్తే సరిపోతుంది. ఇందుకే ‘తాను సినిమాల్లో నటిస్తానో లేదో తెలీదు కానీ ప్రొడక్షన్ చేస్తాను’ అని పవన్ అన్న మాటలు ఉదహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: