ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉంటాయన్న విషయం తెలిసిందే.. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. ఇకపోతే ఈ కోడి గుడ్డును రోజు వారిగా ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు కూడా ఇకపోతే ఎప్పుడు పంచభూతాలతో ఆటలాడకూడదని అంటారు పెద్దలు కాని ఇప్పుడు తెలిసిందేమిటంటే తినే ఆహారంతో కూడా మజాకలు ఆడకూడదని అర్ధం అయ్యింది.


వెటకారం వెయ్యివిధాల చేటు అనే నానుడి నిజం చేస్తూ జరిగిన ఘటన వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. స్నేహితులతో సరదాగా కాసిన పందెం అతని మరణానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్‌, జాన్‌పూర్‌లోని బీబీగంజ్‌ బజార్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.. స్నేహితులందరు ఓ చోట కూర్చొని మాట్లాడుతుండగా ఎవరు ఎన్ని గుడ్లు తినగలరన్న చర్చ వచ్చింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పగా ఆ నవ్వులాటలో  50 గుడ్లు తిని బాటిల్ మద్యం తాగిన వారికి రూ. 2 వేలు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయాన్ని ప్రకటించారు.


ఆ స్నేహితుల సవాలుకు సుభాష్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. పోటీ మొదలైన క్రమంలో 41 గుడ్లను అవలీలగా తినేశాడు సుభాష్. 42వ గుడ్డు తింటుండగా అస్వస్థతకు గురై క్రిందనే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ యాదవ్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో సుభాష్ కుటుంబంలో విషాదచాయలు అల్లుకున్నాయి.


ఇకపోతే నలుగురు ఓ చోట కూర్చుని నవ్వులాటకు వేసుకున్న పందెం ఈ నిండు ప్రాణాన్ని బలి తీసింది. అందుకే ఎప్పుడు కూడా సరదాకు కూడా ప్రాణాలతో చెలగాటమాడే పందాలను కాయకూడదని, సరదాగా గడిపే సమయాన్ని నలుగురికి ఉపయోగపడే ఆలోచనలతో కొనసాగించాలని అతి అనేది ఎప్పుడు అనర్ధాలకు మూలమని హెచ్చరిస్తున్నారు...



మరింత సమాచారం తెలుసుకోండి: