ప్రస్తుత దైనందిన జీవితంలో హెల్త్ పాలసికి ఎంత ప్రాధాన్యత ఉందో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా కుటుంబాలు అందులోను మధ్య తరగతి కుటుంబాలు ఆరోగ్య బీమాకు చాలా ప్రాధాన్యతనే ఇస్తున్నాయి. ఇటువంటి వాటిలో ఎల్ఐసి యే అందరికి ముందు గుర్తుకొస్తోంది.

 

ఇటువంటి ఎల్ఐసిలో కొంతకాలం పాటు ప్రీమియంలు కట్టి వివిధ కారణాల వల్ల చాలామంది ఆపేస్తుంటారు. దాంతో అప్పటి వరకు కట్టిన డబ్బులు వెనక్కు రాకపోతే ఏదైనా అవసరం వస్తే బీమా కూడా వర్తించదు. రెగ్యులర్ గా డబ్బులు కట్టకపోవటం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. ఇలా ల్యాప్స్ అయిపోతున్న పాలసీలే ఏడాదికి కొన్ని వేలుంటాయనటంలో సందేహమే లేదు.

 

సో పాలసీదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసి తాజా ఓ కొత్త నిర్ణయాన్ని ప్రకటించిది. ప్రీమియం చెల్లించలేక రెండేళ్ళు ల్యాప్స్ అయిపోయిన పాలసీలను కూడా పాలసీదారులు మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  2013  ఐఆర్డిఏఐ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్స్  2013  ప్రకారం  2014 జనవరిబ 1 వ తేది నుండి ప్రీమియం చెల్లించకుండా ల్యాప్స్ అయిపోయిన రెండేళ్ళ వ్యవధి పాలసీలను వెంటనే పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది యాజమాన్యం.

 

 ఎల్ఐసి తాజాగా తీసుకున్న నిర్ణయం వేలాదిమంది పాలసీదారులకు శుభవార్తగానే చెప్పాలి. ల్యాప్స్ అయిపోయిన పాలసీలను పునరుద్ధరించుకోవాలంటే ఒకపుడు సాధ్యమయ్యేది కాదు. దానితో పాలసీని పునరుద్ధరించుకుందామనే ఆలోచన చేసినా సాధ్యం కాదనే సమాధానం వచ్చేసరికి పాలసీదారులు వాటిని అలాగే వదిలేసేవారు. కానీ తాజా నిర్ణయం పాలసీదారులు చాలా ఉపయోగమనే చెప్పాలి.

 

 ఎల్ఐసి కొత్త నిబంధనల ప్రకారం సంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు ఐదేళ్ళ వరకూ గడువుంది. యూనిట్ లింక్డ్ పాలసీలకు 3 ఏళ్ళ వరకూ అవకాశం ఇచ్చింది యాజమాన్యం. కాబట్టి ఎల్ఐసి కొత్త నిర్ణయంతో ల్యాప్సయిపోయిన పాలసీలు ఉన్న వాళ్ళంతా తమ పాలసీల దుమ్ము దులిపి మళ్ళీ పునరుద్ధరణకు దగ్గరలో ఉన్న కార్యాలయాలకు వెళ్ళి లాభం పొందాలని ఎల్ఐసి ప్రకటించటం మంచిదే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: