గత నెల రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూనే ఉన్నారు. నెల రోజుల ముందు సరిగా దసరా పండుగకు మూడు రోజుల ముందు సమ్మె ప్రారంభం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆ తర్వాత ప్రభుత్వం కొంచం కస్టపడి తాత్కాలిక డ్రైవర్లను నియమించి అక్కడక్కడా ఆ డ్రైవర్లతో యాక్సిడెంట్లు చేయించి ఈ సమ్మె ఎఫెక్ట్ ని ప్రజలపై అంత పడనియ్యలేదు. 

                                        

అయితే అప్పటి నుండి కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు చర్చలు జరగడం అవి విఫలం అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది. ఆ సమయంలోనే మొన్న శనివారం తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు చివరి అవకాశం.. ఈ నెల 5వ తారీఖులోపు విధుల్లో చేరండి.. లేకుంటే ఉద్యోగాలు పోతాయి అని డెడ్ లైన్ పెట్టాడు. 

                                                

దీంతో కేసీఆర్ కి భయపడిన 12 ఆర్టీసీ కార్మికులు మరుసటి రోజే విధుల్లో చేరారు. కానీ 24 గంటలు కూడా అవ్వకముందే తిరిగి ఆర్టీసీ సమ్మెలోకి వచ్చారు. కాగా కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ఈరోజే. దీంతో ఈరోజు సమ్మె మరింత ఉదృతంగా మారింది. ఆర్టీసీ కార్మికులు విరమించేది లేదని.. నేడు అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చెయ్యాలని ఆర్టీసీ జేఏసీ అశ్వథామ రెడ్డి పిలుపునిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: