తహశీల్దార్ విజయారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో విజయారెడ్డి హత్య కేసులో కీలకమైన భూవివాదానికి సంబంధించిన ఒక ఆడియో టేపు వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో టేపులో కొందరు రాజకీయ నేతల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ ఆడియో టేపు వైరల్ అవుతోంది. గౌరెల్లి గ్రామానికి చెందిన ఒక రైతుకు అంబర్ పేటకు చెందిన ఒక నేతకు మధ్య సంభాషణ జరిగింది. 
 
ఆడియో టేపులో గ్రామ రైతు మొత్తం 412 ఎకరాల భూమిని దశాబ్దాల క్రితం కొన్నారని తాతల కాలం నుండి ఈ భూముల విషయంలో వివాదాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఈ భూములు ఆ ప్రభుత్వానికి చెందిన వారివి అనే విధంగా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారని ఆ రైతు నేతతో ఆడియో టేపులో చెప్పాడు. రైతుల దగ్గర పాత పాస్ బుక్కులు ఉన్నాయని కౌలుదారుల దగ్గర కూడా పాస్ బుక్కులు ఉన్నాయని అప్పటినుండి వివాదాలు జరుగుతూనే ఉన్నాయని రైతు ఆడియో టేపులో చెప్పాడు. 
 
ఒక ఎమ్మెల్యే ఈ భూముల వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆ రైతు రాజకీయ నేతతో  చెప్పాడు. ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేనే అని ఆ రైతు చెప్పాడు. హత్య చేసిన బాధితుడికి సంబంధించిన డబ్బులు కూడా ఉన్నాయని ఆ రైతు చెప్పాడు. హత్య చేసిన వ్యక్తికి 7 ఎకరాల భూమి ఉందని ఆడియో టేపులో రైతు చెప్పాడు. ఈ ఆడియో టేపులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరు ఉండటంతో ఎమ్మెల్యే ఈ ఘటనపై స్పందించాడు. 
 
ఎమ్మెల్యేగా కలవటానికి రోజూ ఎంతోమంది వస్తూ ఉంటారని తహశీల్దార్ విజయారెడ్డిపై దాడి ఘటన దారుణమని ఎమ్మెల్యే అన్నారు. 11 సంవత్సరాల నుండి శాసన సభ్యుడిగా ఉన్నానని ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదని విచారణలో నిజాలు తెలుస్తాయని అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి విజయారెడ్డి మృతి గురించి మాట్లాడుతూ రెవిన్యూ ఉద్యోగులను ప్రభుత్వం విలన్లుగా చూపించిందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలే హత్యకు కారణమని అశ్వత్థామరెడ్డి ఆరోపణలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: