క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కెేసీయార్ మూడు రోజుల క్రితం భీకరమైన హెచ్చరికలు జారీచేశారు. 5వ తేది రాత్రిలోగా ఉద్యోగాల్లో చేరకపోతే  సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులందరూ డిస్మిస్ అయినట్లే అని చెప్పేశారు.

 

కెేసీయార్ ఇచ్చిన వార్నింగ్ తో ఇంకేముంది సమ్మె ఫెయిల్ అయినట్లే అనుకున్నారు. తీరా చూస్తే ఉద్యోగాల్లో చేరింది కేవలం 6 మంది మాత్రమే. అంటే మొత్తం 16 మంది చేరినా అందులో కొందరు సంతకాలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సమ్మెలో చేరిపోయారట. మిగిలిన వాళ్ళు మాత్రమే చేయటానికి ఆఫీసులో పనేమీ లేక ఏదో కాలక్షేపం చేశారు.

 

నిజానికి చేరిన 16 మంది కూడా తొందరలోనే రిటైర్ అవబోతున్నారని సమాచారం. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఉద్యోగులకు ఉద్యోగంలో  ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటే తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటిని ప్రభుత్వం ఆపేస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే 16 మంది కూడా విధుల్లో చేరారట. పైగా తమ రిటైర్మెంట్ ఫైలు కనీసం 6 మాసాల ముందే రెడీ అయినా ఇంకా సంతకాలు పెట్టించుకోవాల్సిన కాగితాలు చాలానే ఉంటాయి. ఆ పనులు చేసుకోవటానికే కొందరు విధుల్లో చేరారట.

 

గడచిన 32 రోజులుగా  సమ్మెల్లో 43 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారు. చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటున్న వారందరు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్లు కెేసీయార్ ఎప్పుడో ప్రకటించేశారు. అలాంటిది 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే వారంతా సెల్ఫ్ డిస్మిస్ అవుతారని తాజాగా చెప్పటమే విచిత్రంగా ఉంటోంది.

 

పైగా ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని కార్మికశాఖ కూడా రిపోర్టు ఇచ్చిందని కెేసీయార్ చెప్పటమే విడ్డూరంగా ఉంది. ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్దమే అని ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఓ శాఖ సిఎంకు రిపోర్టు ఇస్తుందా ఎక్కడైనా ? నిజంగా వీళ్ళు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమైతే  కేసు విచారిస్తున్న కోర్టు ఆ విషయాన్ని ఇప్పటి వరకూ ఎప్పుడు ఎందుకు చెప్పలేదు ?  మొత్తం మీద కెేసీయార్ వార్నింగ్ కు భయపడింది 6 మందే అని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: