ప్రతిభా పురస్కారం.. ఇప్పటివరకు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కార్‌ అవార్డుగా ఉండే ఈ పురస్కారాన్ని వైఎస్‌ఆర్‌ విద్యా పురస్కారాలుగా పేరు మార్చినట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉతర్వులను వెంటనే రద్దు చెయ్యాలని సీఎం జగన్ సూచించారు. 

                             

సీఎం జగన్ పేరు మార్పు అగ్రం వ్యక్తం చేస్తూ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని, మరికొన్ని అవార్డులకు దేశంలోని మహనీయుల పేర్లు కూడా పెట్టాలని ఆదేశించారు. గాంధీ, అంబెడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని అయన సూచించారు.

                             

కాగా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇచ్చే ఈ పురస్కారాలను ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకే ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఇప్పటి వరుకు ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్స్ అని లేకుండా ఈ అవార్డులను ఇచ్చారు. 

                         

అయితే ఇప్పటి నుండి మాత్రం కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే ఇవ్వనున్నారు. ఈనెల 11న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్బంగా ఆరోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందజెయ్యనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ సంవత్సరం నుండి జిల్లాలవారీగా ఈ ప్రతిభ పురస్కారాన్ని నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: