యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామపంచాయతి లో ఇటీవల సీఎం కెసిఆర్ గారు తలపెట్టిన ౩౦ రోజుల గ్రామా అభివృద్ధి  ప్రణాళిక కార్యక్రమంలో లో భాగంగా గ్రామపంచాయతి సర్పంచ్, గ్రామా కార్యదర్శి మరియు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు మరియు ప్రత్యేక కార్యనిర్వహణ అధికారి  అద్వర్యం లో గ్రామసభ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాన్ని ఈ ౩౦ రోజులలో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారు డ్రైనేజీ ల ప్రక్షాళన, ఇంటి పరిసరాల శుభ్రత, మంచి నీటి పంపిణి మరియు వీధిదీపాల ఏర్పాటు ఈ ౩౦ రోజులలో గ్రామమంతా ఒక పరిశుబ్రాంగా తాయారు చేసారు. పాత మరియు కూలిపోవడానికి ఉన్న కట్టడాలను కూల్చేయడం రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడం  వాటిని పరిరక్షించడం అలాగే గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని రేపుతూ చేయడం లాంటి పనులతో దూసుకుపోయిన గ్రామం కచ్చితంగా ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాడాలని చాల కృషి చేసారు.

అయితే గత ౩౦ రోజులలో చేసిన పనులకు గాను జరిగిన ఖర్చులు సాధారణంగా ఉన్న గ్రామంలో వీరి హయం లో గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఆందోళనలో ఉన్న గిట్టని వారు గ్రామాలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతలూగుతూ వచ్చారు కానీ గ్రామపంచాయతి వారి అడ్డగింపులు పట్టించుకోక అభివృధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గ్రామం లో ఎప్పుడు వెలగని వీధుల్లో వీధిదీపాలు వెలుగుతున్నాయి. డ్రైనేజీ నుండి గతం లో వచ్చే మురిక వాసనా ఎప్పుడు రావడం లేదు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకున్న సందర్భం లో గ్రామంలో ఒక అలజడిని సృష్టించడానికి కొందరు వార్డ్ సభ్యులు సహాయం తో కొందరు గ్రామంలో నిధులు దుర్వినియోగం కలుగుతున్నాయని, మాకు తెలియకుండా మమ్మల్ని సంప్రదించకుండా పనులు జరుగుతున్నాయి అని అలాగే గ్రామానికి ఎంత ఖర్చు పెట్టె అవసరం లేదు అని ఆరోపించడం ఒక చెడ్డ పుకారుని కల్పించారు. దీనితో విరక్తి చెందిన గ్రామం కార్యదర్శి వారిని పిలిపించి సర్పంచ్, ఉప సర్పంచ్ అద్వర్యం లో మాట్లాడి వారికీ పూర్తి లెక్కలను వివరించి ఎక్కడ ఎంత పెట్టారు రసీదులు కూడా సమర్పించడం తో ఎంత ఎందుకు పెట్టారు అని, ఎవరిని అడిగి పెట్టారు అని వాదనలు జరిపి గ్రామకార్యదర్శిని కూడా లెక్క చేయకుండా వీరి పైన ఎలా దుర్వినియోగం చేసారని ఎంపీడీఓ మరియు పిఆర్ఏఈ రాజాపేట గారికి  రాసిన పిర్యాదు లో కేవలం  గ్రామ సర్పంచ్ ని మాత్రమే దీనిలోకి లాగి మహిళా  మరియు దళిత కుటుంబానికి చెందిన  గ్రామ సర్పంచ్ ని భయబ్రాంతులకు గురి చేయాలనీ గ్రామకార్యదర్శిని కూడా ఇబ్బంది పెట్టడానికి చేసిన ఈ పన్నాగం లో వారు తేలిపోతారనడం లో అతిశయోక్తి లేదు గ్రామస్థులు భరోసా ఇచ్చారు.

  కానీ సంయుక్త చెక్ పవర్ ఉన్న గ్రామపంచాయతీ లకు కేవలం  గ్రామ సర్పంచ్ నే ఇందులోకి లాగి ఇలా ఇబ్బంది పెట్టడం గమనార్హం అలాగే వారు  చేసిన ఖర్చు అంత గ్రామాభివృద్ధి కోసమేనని గుర్తించాలని గ్రామస్థులు, గ్రామ పెద్దలు అన్నారు. అయితే కొందరు వార్డ్ సభ్యులతో కలిసి గ్రామపంచాయతి లో వారి గుర్తింపు కోసం పనులకు ఆటంకం కల్పించాలని చూస్తున్నారా? ఇంకేదైనా ఆశిస్తున్నారా? వీరి వెనకాల ఉన్న దుష్ట శక్తులు ఎవరు?  అని ఒక కమిటీ వేసి వారిని గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని అలాగే  ౩౦ రోజుల గ్రామా అభివృద్ధి  ప్రణాళిక కార్యక్రమం అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమం అని దీనిపైనా ఏదైనా అవినీతి జరిగితే మేము వాటిని పర్యవేక్షించాడనికి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు జవాబు ఇవ్వడం తో ఈ సమస్య కు సమాధానం వచ్చే గ్రామసభ లో చెబుతామని మిగతా వార్డ్ సభ్యులు, కార్యదర్శి మరియు సర్పంచ్ లు ప్రకటించారు. 


అలాగే వార్త పేపర్ లలో వచ్చిన వార్త నిజం కాదని ప్రజలకు తెలియచేసారు అలాగే  వార్త ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకొని రాయాలని మీడియా వారికీ విజ్ఞప్తి చేసారు. ఎవరికైనా వార్డ్ సబ్యులకు ఏమైనా సమస్యలు ఉంటె మాకు తెలియచేసి చర్చించి సమస్య ను లేకుండా చూసుకోవాలని అన్నింటికీ అధికారుల దృష్టికి మన పరువుని తీసుకెళ్లి గ్రామం పరువు ని తీయొద్దు అని సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: