తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనానికి కారణమైన నిందితుడు సురేశ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. సురేశ్ కు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. పోలీసుల సంరక్షణలో ప్రస్తుతం సురేశ్ కు చికిత్స జరుగుతోంది. సురేశ్ కు ప్రస్తుతం మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స జరుగుతోంది. 65 శాతం సురేశ్ శరీరానికి కాలిన గాయాలు అయ్యాయి. మరో 72 గంటలు గడిస్తే తప్ప సురేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. 
 
నిన్న సురేశ్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు మొదట ప్రాథమిక చికిత్స అందించి మేల్ బర్నింగ్ వార్డ్ కు తరలించారు. తల భాగంలో, ఛాతీ భాగంలో సురేశ్ కు తీవ్రంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. సురేశ్ ను చూడటానికి బంధువులు, స్నేహితులు ఇప్పటివరకూ ఎవరూ రాలేదని తెలుస్తోంది. పోలీసులు సురేశ్ కుటుంబ సభ్యులను ఉస్మానియా ఆస్పత్రికి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. 
 
సురేశ్ శరీరం వైద్యానికి సహకరిస్తే మాత్రమే ఇతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో సురేశ్ విజయారెడ్డిని హతమార్చింది తానేనని ఒప్పుకున్నాడు. ఒక భూవివాదం వలన విజయారెడ్డిపై పెట్రోల్ పోసి హత్య చేసినట్లు సురేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ల్యాండ్ మ్యుటేషన్ వలన సురేశ్ విజయారెడ్డిని హతమార్చాడని చెబుతున్నారు. 
 
పోలీసులు వైద్యులు డిశ్చార్జ్ చేసిన తరువాత అదుపులోకి తీసుకొని నిందితుడు సురేశ్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు  డిశ్చార్జ్ తరువాత అన్ని కోణాల్లో దర్యాప్తు జరపబోతున్నారని తెలుస్తోంది. పట్టా ఇవ్వాలని ఎన్నో రోజులుగా ఎమ్మార్వో విజయారెడ్డిని బ్రతిమాలినా పట్టా ఇవ్వలేదని నిన్న మరోసారి విజ్ఞప్తి చేసినా విజయారెడ్డి స్పందించకపోవటంతో మొదట తనపై పెట్రోల్ పోసుకొని ఆ తరువాత విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సురేశ్ తెలిపాడు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: