టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మొదటి తరం అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత రెండవ తరం హీరోలుగా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గారు కొన్నేళ్ల పాటు అగ్ర నటులుగా కొనసాగడం జరిగింది. ఇక వారి ముగ్గురిలో ఎవరికి వారు తమదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ మంచి ప్రేక్షకాదరణ పొందుతూ ఎందరో అభిమానులను సంపాదించడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని సార్లు వారి సినిమాల రిలీజ్ సమయంలో అభిమానుల మధ్య కొద్దిపాటి వాగ్వివాదాలు జరిగేవట. అయితే అవి మరీ అంత పెద్దవి కాదని, కొద్దిరోజుల తరువాత మెల్లగా అవి సమసిపోయేవని ఒకప్పటి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. 

అయితే అప్పట్లో కృష్ణకి తనకు స్నేహితులుగా ఎంతో మంచి అనుబంధం ఉండేదని రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, అప్పట్లో కృష్ణకు,తనకు సంబందించిన ఒక ఆసక్తికర సంఘటనను ఆయన బయటపెట్టడం జరిగింది. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి దిగ్విజయంగా అప్పటి కాంగ్రెస్ మీద విజయఢంకా మ్రోగించిన తరువాత కొద్దిరోజులకు కృష్ణ, కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించడం జరిగిందని అన్నారు. అయితే తనకు మాత్రం అప్పట్లో రాజకీయాల పై అంతగా ఆసక్తి ఉండేదని కాదని అన్నారు కృష్ణంరాజు. 

కాగా మధ్యలో కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు, సర్ మీరు, కృష్ణ ఎంతో కాలంగా మంచి మిత్రులు కదా, కాబట్టి మీరిద్దరూ కలిసి ఒక రాజకీయ పార్టీని నెలకొల్పితే బాగుంటుంది కదా అని అన్నారట. అయితే పార్టీ పై తనకు పెద్దగా ఆసక్తి లేదని, అందువలన ఆ విషయాన్ని ప్రక్కన పెట్టడం జరిగిందని కృష్ణంరాజు అన్నారు. కానీ ఆ తరువాత కాలంలో కృష్ణతో కలిసి తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని, అనంతరం కొద్దిరోజుల తరువాత బీజీపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అందులో చేరడం జరిగిందని, అప్పటి స్మృతులను కృష్ణంరాజు నెమరువేసుకున్నారు.......!!    

మరింత సమాచారం తెలుసుకోండి: