ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ వెనుక అసలు కదా ఇంతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను చూస్తుంటే. ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించి ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇని స్ట్యూట్ డిజీగా బదిలీ చేశారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరభ్ కుమార్ ని నియమితులయ్యారు. ఈ మేరకు  జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వలు జారీ చేశారు. సీఎం ముందు అంగీకరించి ఆ తర్వాత కొర్రీ వేయడంలో సీఎంకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఫలితంగా ఆయనపై బదిలీవేటు పడిందని అధీరవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే అంశాలపై సోషల్ మీడియాలో కూడా కధలు కధలుగా వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ర్రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రి కున్న విశేష అధికారం. సీఎం పీఠంలోకి జగన్‌ వచ్చినా, అదే సీట్లో కొనసాగుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొనసాగించారే తప్ప తప్పించలేదు. సీఎస్‌ పదవిలోనే కాదు, ఏయే శాఖలకు ఎవరు కార్యదర్శిగా ఉండాలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులకు, ముఖ్యకార్యదర్శులుగా, ప్రత్యేక కార్యదర్శులుగా ఎవరు ఉండాలన్నది కూడా ముఖ్యమంత్రికున్న విశేష అధికారాల్లో ఒకటి.



ఇటీవలి కాలంలో పలానా శాఖకు చురుకైన అధికారి ఉండాలని సీఎం సమీక్షా సమావేశాల్లో అడుగుతున్నారు. అంతేకాదు తాను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి కష్టపడే మనస్తత్వం, చురుగ్గా ఉండే వాళ్లు కావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాని ఆయన సూచించిన వారి పేర్లు వారాల తరబడి పెండింగులో ఉండిపోతున్నాయి. పలానా వ్యక్తిని పలాన స్థానంలో పెట్టాలని సీఎం నేరుగా చెప్పినా ఫలితం లేకపోయింది. తనకు నచ్చడంలేదనే వ్యక్తిగత కారణంతో రోజులు తరబడి.. ఐఏఎస్‌ అధికారుల నియామకాలు నిలిచిపోతున్నాయి. ఇది తీవ్రమైన ఉల్లంఘన. 
ప్రవీణ్‌ ప్రకాష్‌కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎత్తి చూపించారు. వాస్తవానికి ఆ రెండు కూడా సీఎం సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్‌ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్‌కు తెలియకుండా జరిగినవి కావు.  వైయస్సార్‌ పేరు మీదుగా లైఫ్‌టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. .



కేబినెట్‌ సమావేశానికి ముందు ఎజెండాలో ఎలాంటి అంశాలు పెట్టాలన్నదానిపై జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శులు, చీఫ్‌ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సామాజిక సేవ, ఇతరత్రా రంగాల్లో సేవచేసినవారికి ప్రతిభ చూపిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఈ సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రే సీఎస్‌కు వెల్లిడించారు. అక్కడ సీఎస్‌ దీనికి అంగీకారం కూడా తెలిపారు. రేపటి క్యాబినెట్‌ అజెండాలో పెడదామన్నా..! అని సాక్షాతూ సీఎం జగన్ చెప్పారు కూడా. తీరా ప్రవీణ్‌ ప్రకాష్‌ ఫైలు తయారుచేశాక.. ఆర్థిక శాఖ అనుమతి లేదని వెనక్కి పంపారు. వాస్తవానికి ఆర్థికశాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైలును కేబినెట్లోనే పెట్టొచ్చు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థికశాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని, ఆ తర్వాత కొర్రీ పెట్టడం సీఎస్‌ పై ఆగ్రహానికి దారి తీసింది. 
ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌ జారీ చేసిన నోటీసులో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు అంశం. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ న్యాయాలయాలు పెట్టాలని నిర్ణయం. దీనికి సంబంధించి సీఎస్‌ పంపిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అయితే తర్వాత సీఎం... గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామన్నారు. సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు. ఎంత ఖర్చు చేస్తున్నాం.



ఎన్ని  పెడుతున్నారు.  అవి సరిపోతాయా.. ఇంకా పెంచాలా.. వద్దా.. అన్నదానిపై న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం పెట్టమని సీఎం ఆదేశించిన మీదటే ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు. ఈ  వ్యవహారం అంతా సీఎం, సీఎస్‌ల సమక్షంలోనే జరిగింది. అయినా సరే, ఆ ఫైలును ఎందుకు పంపలేదంటూ సీఎస్‌ పట్టుబట్టడం... తీవ్రమైన ఉల్లంఘనగా భావించారు. పై రెండు విషయాలను చూస్తే ఆ నిర్ణయాలేవీ సీఎస్‌కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్‌ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారు. అదే సమయంలో తన సమక్షంలో, తనకు తెలిసీ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సీఎస్‌ కూడా పాటించాలి. అలా కాక సాంకేతిక అంశాలను చూపించి, ఆ నిర్ణయాలను సవాల్‌ చేసేలా నిలుపుదల చేయడం, సీఎం తనకు చెప్పినా సరే.. మళ్లీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీచేయడాన్ని, భారతదేశంలో ఏముఖ్యమంత్రికూడా అంగీకరించరు. ప్రభుత్వ వ్యవస్థను నడిపే అధినాయకుడిగా ఏ ముఖ్యమంత్రి కూడా చూస్తూ ఊరుకోరు. ఇది మాజీ సీ.యస్ ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీ వెనుక ఉన్న అసలు కధ అంటూ సోషల్ మీడియాలో పలు కధనాలు వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: