తాహసిల్దార్ విజయ రెడ్డి హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. దుండగుడు ఏకంగా మధ్యాహ్నం సమయంలో అందరూ ఉండగానే పెట్రోల్ బాటిల్ తో  తాహసిల్దార్ విజయ రెడ్డి రూమ్ లోకి వెళ్లి నిప్పంటించి హత్య చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. కాగా  మంటలు అంటుకున్న విజయారెడ్డి కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఉద్యోగులకు  కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే అందరూ చూస్తుండగానే తాసిల్దార్ విజయ రెడ్డి మంటల్లో సజీవదహనం అయిపోయింది. ఒక మహిళ తాసిల్దార్ పై ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే హత్య జరగడం తో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయారెడ్డి హత్యకు  నిరసనగా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే రక్షణ కరువైతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. 



 అయితే విజయ రెడ్డి ని హత్య చేసిన దుండగులు సురేష్ అనంతరం వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే తాసిల్దార్ విజయ రెడ్డి పై దాడి చేసిన దుండగుడు ఒక రైతుగా పరిగణించారు పోలీసులు. అతని నుంచి లంచం డిమాండ్ చేయడం వల్లే విజయ రెడ్డిని హత్య చేశానంటూ  నిందితుడు సురేష్ తెలిపినట్లు సమాచారం . ప్రస్తుతం నిందితుడు  సురేష్ కి కూడా గాయలు  అవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు కోలుకున్నాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా విజయ రెడ్డి హత్య పై కాంగ్రెస్ నేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 



 ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే తాసిల్దార్ విజయ రెడ్డి హత్య జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులందరిని  దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాసిల్దార్ విజయ రెడ్డి హత్య పై సిబిఐ విచారణ చేపట్టాలంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయారెడ్డి భౌతిక కాయానికి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. విజయారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు ఎంపీ రేవంత్ రెడ్డి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ రేవంత్ రెడ్డి కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని  రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాక్యాలు సంచలనంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: