మామూలుగా అయితే చాలామందికి వారంలో  వీక్లీ ఆఫ్ ఒక రోజు వస్తుంది... కానీ మల్టీ నేషనల్ కంపెనీల్లో  మాత్రం వారానికి రెండు రోజులు వీక్ ఆఫ్ వస్తుంటుంది అక్కడ ఎంప్లాయిస్ కి. ప్రతి శని ఆదివారాలు వీక్లీ ఆఫ్ పొందుతుంటారు. కొంతమంది 2 రోజులు  వీక్లీ ఆఫ్ వస్తుందని ఆనంద  పడుతుంటే ఇంకొంతమంది రెండ్రోజులు కాస్త మూడు రోజులు వస్తే బాగుండు అంటూ కలలు కంటూ  ఉంటారు. కాగా  ఎప్పటినుంచో ఊహల్లో ఉన్న మూడు రోజుల వీకప్ ని నిజం చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఏ కార్పొరేట్ సంస్థ చేయని సాహసం మైక్రోసాఫ్ట్ సంస్థ చేసింది. జపాన్లో రెండు వేల మూడు వందల మందికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు శుక్ర శని ఆదివారాలు కలిపి మూడు రోజుల పాటు వీకాఫ్  ప్రకటించింది. సాధారణంగా అయితే కార్పొరేట్ కంపెనీలు ఏవైనా వీక్లీ ఆఫ్ ఇస్తే  మిగతా టైం లో పనిచేయాలని నిబంధనలు ఉంటాయి. కానీ అలాంటి నిబంధన ఏమీ లేకుండానే వారానికి మూడు రోజులపాటు వికాఫ్  ప్రకటించింది  మైక్రోసాఫ్ట్ కంపెనీ. 



 ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయం గడపడం లేదని... ఎప్పుడూ పని పని అంటూ పనిలోనే మునిగిపోవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్... మూడు రోజుల పాటు వీక్ ఆఫ్ ఇస్తే ఎలా ఉంటుందా అని భావించిందట . ఈ నేపథ్యంలోనే వర్కింగ్ రిఫార్మ్  ప్రాజెక్ట్ అని ప్రారంభించి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ శుక్ర శని ఆదివారాల్లో వీకప్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వీక్ ఆఫ్ లు ఎప్పటికీ కాదులెండి  ఒక్క నెల రోజులు మాత్రమే. అయితే ఈ మూడు రోజులు వీక్ ఆఫ్ ఇవ్వడం వల్ల కంపెనీలో ఉద్యో గులు ఇంతకు మునుపు కంటే ఇప్పుడు వేగంగా పని చేస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఇదివరకు కాఫీలు మీటింగ్లు అంటూ టైం వేస్ట్ చేసేవారని కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తున్నారని తెలిపింది. 



 మూడురోజుల వీక్ ఆఫ్ వల్ల ఉద్యోగులందరూ మరింత శ్రద్ధగా పని చేస్తుండడంతో ఈ మూడు రోజుల వీక్ ఆఫ్ ను కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కార్పొరేట్ కంపెనీ మూడు రోజుల వికాఫ్  ఇస్తే మిగతా సాఫ్ట్ వెర్  కంపెనీల్లో  కూడా ఇదే ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. 3 రోజుల వీకాఫ్ వల్ల ఉద్యోగులకు  మెంటల్ టెన్షన్ లు కూడా తగ్గుతాయని పరిశోధకులు కూడా చెబుతున్నాయి. ఇక ఇది తెలిసిన మిగతా కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఇలాంటి 3 రోజుల వీకాఫ్  తమ కంపెనీలో కూడా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఒకవేళ మూడురోజుల వీకాఫ్ నీ మైక్రోసాఫ్ట్ సంస్థ  ఎల్లవేళలా ప్రవేశపెడితే ఇది మిగతా కంపెనీల్లో కూడా వ్యాపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: