జగన్ కంటే పిచ్చోడి నయం అంటూ విశాఖ లాంగ్ మార్చ్ లో దారుణమైన కామెంట్స్ చేసిన సీనియర్ పొలిటీషియన్ ఆయన. జగన్ మీద విరుచుపడమంటే చంద్రబాబు కంటే వేగంగా స్పందిస్తారు. ఇక ఆయన మాటలకు హద్దు ఉండదు, తాను 37 ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నానని కూడా ఆలోచించకుండా అయ్యన్న చేసే హాట్ కామెంట్స్ ఎపుడూ వివాదాస్పదంగానే ఉంటాయంటారు. ఇక లాంగ్ మార్చ్ లో ఆయన జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్ చేశారు. మెంటల్ ఆసుపత్రి నుంచి పిచ్చోడుని తెచ్చినా జగన్ కంటే బాగా పాలిస్తాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కి ఇపుడు సరైన షాక్  ట్రీట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.


జగన్ కి వచ్చిన 151 సీట్లు కూడా ఎలా వచ్చాయో తెలియదు అన్నారు అయ్యన్న. ఈవీఎంల మ్యాజిక్కో మరే లక్కో కూడా తెలియదు అన్నారు. ఆ విధంగా ప్రజా తీర్పుని కూడా అవమానించేలా మాట్లాడారు, మరో వైపు వద్దంటున్న జగన్ కి ఓటేశారంటూ తప్పు చేసిన ప్రజలకు కావాలిందేన్నన్న‌ట్లుగా కూడా అయ్యన్న మాట్లాడారు. మరి ఈ విధంగా రెచ్చిపోతే జగన్ వూరుకుంటారా. కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే సరైన షాక్ ఇచ్చేశారు.


ఏకంగా అయ్యన్న సోదరుడు, నర్శీపట్నంలో బలమైన నేతగా ఉన్న మునిసిపాలిటీ మాజీ వైఎస్ చర్మన్ సన్యాసిపాత్రుడిని, చైర్ పర్సన్ ఆయన సతీమణి అనితను  తన దగ్గరకు పిలిపించుకుని మరీ కండువా కప్పేశారు. దాంతో అయ్యన్నకి ఝలక్ ఇచ్చారని అంటున్నారు. అయ్యన్న గెలుపు వెనక సన్యాసిపాత్రుడు ఉంటారన్నది అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అయ్యన్ని గెలిపిస్తూ వస్తున్న సన్యాసిపాత్రుడుకి నర్శీపట్నం మునిసిపాలిటీలో మంచి పట్టు ఉంది. అయ్యన్నకు ఆ మెజారిటీయే ఎపుడూ కాపాడుతూ వస్తోంది.


ఇపుడు సొంత సోదరుడే వైసీపీలో చేరడాన్ని అయ్యన్న ఎలా చూస్తారో మరి ఇది కూడా ఈవీఎంల ల మహిమ అంటారో, లేక జనాలు తప్పు చేసినట్లుగా సోదరుడు  కూడా తప్పు చేశారని నిందిస్తారో అని సెటైర్లు పడుతున్నాయి. అయ్యన్న అవుట్ డేటెడ్ పాలిటిక్స్ కాలం చెల్లిందనడానికి 2019 ఎన్నికల్లో ఆయన్ని ప్రజలు 25 వేల పై చిలుకు తేడాతో ఓడించడమే ఉదాహరణ అని నర్శీపట్నం వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అయ్యన్న రాజకీయం ఓ విధంగా ఇబ్బందులో పడిందనే చెప్పాలి. మరి జగన్ టార్గెట్ ఇంకా ఎవరి మీద ఉందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: